చిరంజీవి మూవీ టైటిల్‌తో అల్లరి నరేష్
ఈ చిత్రానికి 'యముడికి మొగుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే టైటిల్ పై చిరంజీవి చిత్రం వచ్చింది. 1988 వచ్చిన ఆ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. టైటిల్ క్యాచీగా ఉండటంతో దీన్నే ఖరారు చేసే దిశగా దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
ఈ చిత్రంలో కోసం రాజమోజీ ఫిల్మ్ సిటీలో మొత్తం 11 భారీ సెట్లు వేశారు. ఇందులో యమునిగా షయాజీ షిండే, అతని భార్యగా రమ్యకృష్ణ నటిస్తోందని, సినీయర్ హాస్య నటీనటులతో ఆద్యంతం వినోదంతో రూపొందిస్తున్నారు. సీనియర్ నరేష్, గిరబాబు, చంద్రమోహన్, తనకెళ్ల భరణి, ఏవీఎస్, చలపతిరావు, రఘుబాబు, కృష్ణ భగవాన్, భరత్, సుధ, సత్యకృష్ణ, హేమ, సన, రజిత, చిట్టిబాబు, పృథ్వీ, సారిక రామచంద్రరావు ఇతర ముఖ్య తారాగణం. కథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, ఛాయా గ్రహణం: కె. వీరేంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: కిరణ్ కుమార్, నిర్మాత: చంటి అడ్డాల, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇ. సత్తిబాబు.


Click it and Unblock the Notifications
