23న ‘యముడికి మొగుడు’ ఆడియో

By Bojja Kumar

హైదరాబాద్: యముడి నేపథ్య కథాంశంతో రూపొందుతున్న 'యముడికి మొగుడు' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. అల్లరి 'నరేష్, రిచాపనయ్ నాయకానాయికలుగా ఇ సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మిస్తున్నారు.

తాజాగా ఈచిత్రం పాటల చిత్రీకరణ పూర్తయింది. ఇటీవల స్విట్జర్లాండ్ లో ఓ పాటను చిత్రీకరించడంతో షూటింగ్ పార్ట్ ముగిసింది. కాగా ఈ నెల 23న ఈ చిత్రం ఆడియోను, డిసెంబర్ ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయనున్నామని నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. విభిన్న కథాంశంతో సోషియో ఫాంటసీకి వినోదాన్ని మేళవించి రూపొందిచిన ఈ చిత్రం అన్ని వర్గాలను అలరింపజేస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేసారు.

కాగా నరేష్, తాను కలిసి చేస్తున్న మూడవ చిత్రమిది, పూర్తి వినోదభరితంగా ఉంటుందని దర్శకుడు సత్తిబాబు వెల్లడించారు. స్విట్జర్లాండ్ పాట కూడా ఎంతో బాగా వచ్చిందని ఆయన తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో షాయాజీ షిండే, రమ్య కృష్ణ, నరేష్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, కృష్ణ భగవాన్, రఘుబాబు, చలపతిరావు, ఏవీఎస్, మాస్టర్ భరత్, సత్యకృష్ణ, సన తదితరులు తారాగణం.

ఈ చిత్రానికి మూలకథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, ఛాయాగ్రహణం, కె. రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: కిరణ్ కుమార్, ఫైట్స్: గణేష్, ప్రొడక్షన్ కంట్రోలర్: రామ్ చౌదరి, సమర్పణ: ధనలక్ష్మి అడ్డాల, నిర్మాత: చంటి అడ్డాల, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: ఇ.సత్తిబాబు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X