దసరా బరిలో ‘యముడికి మొగుడు’

By Bojja Kumar

హైదరాబాద్: అల్లరి నరేష్ కథానాయకుడుగా ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'యముడికి మొగుడు'. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో చంటి అడ్డాల నిర్మించిన ఈ చిత్రంలో రీచాపనయ్ కథానాయికగా నటిస్తోంది. రెండు పాటలు మినహఆ ఈచిత్రం షూటింగ్ పూర్తయింది.

మిగిలిన రెండుపాటల్లో క్లైమాక్స్ లో వచ్చే పాటను సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు చిత్రీకరిస్తామని నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. విదేశాల్లో ఇంకో పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలిపారు. సెప్టెంబర్ నెలలో ఆడియో విడుదల చేసి దసరాకి సినిమా ప్రేక్షకుల ముందుకు తెస్తామని తెలిపారు.

ఇంకా ఈ చిత్ర విశేషాలను వివరిస్తూ...గతంలో వచ్చిన సోషియోఫాంటసీ చిత్రాలైన యముడు సిరీస్‌లో మరో చిత్రం ప్రేక్షకులను అలరించడానికి వస్తోందని, 11 భారీ సెట్లతో ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్ రూపొందించామని, కోటి అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచే ఈ చిత్రం పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తుందని తెలిపారు.

త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో సుమన్, షాయాజీ షిండే, రమ్యకృష్ణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ్భగవాన్, చలపతిరావు, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తుండగా సంగీతం: కోటి, కెమెరా: కె.రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజు అందిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత: చంటి అడ్డాల, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X