అల్లరి రవిబాబు నెక్ట్స్ అదే
అనసూయ, నచ్చావులే చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న అల్లరి రవిబాబు త్వరలో ఓ ధ్రిల్లర్ ని ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అమరావతి టైటిల్ తో తయారవన్న ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. గోపీచంద్ తో శౌర్యం వంటి యాక్షన్ చిత్రాన్ని రూపొందించిన భవ్య క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి రవి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు...ఆయన ఇక్కడకు రాగానే సినిమా ప్రారంభమవుతుంది. అంతా కొత్త వారితో ఈ చిత్రం రూపొందించాలని అల్లరి రవిబాబు ఆశిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రంపై మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడటం విశేషం.
allri ravi babu amaravathi anasuya nachavule gopichand souryam అనసూయ నచ్చావులే అల్లరి రవిబాబు ధ్రిల్లర్ అమరావతి గోపీచంద్ శౌర్యం భవ్య క్రియేషన్స్


Click it and Unblock the Notifications