రవిబాబు ధ్రిల్లర్ 'అమరావతి' ఎలా ఉంది?
అల్లరి రవిబాబు డైరక్ట్ చేసిన అమరావతి చిత్రం ఈ రోజు రిలీజైంది. ఈ చిత్రం అనసూయ అంతగా ఆకట్టుకోలేకపోయినా కొన్ని ట్విస్ట్ లు ధ్రిల్ కలిగించాయని సమాచారం. ఈ చిత్రంలో తారకరత్న,భూమిక చిన నాటి స్నేహితులు. అయితే భూమిక తండ్రి..ఆమెను తారకరత్నతో కలవటానికి ఇష్టపడడు. అంతేగాక అతన్ని టార్చర్ పెట్టి నదిలోకి తోసేస్తాడు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. వర్తమానంలోకి వస్తే 108కి ఫోన్ చేసి తొమ్మిది నెలల గర్భిణి ప్రమాదకర పరిస్ధితుల్లో ఉందని చెప్పి,వైద్య సిబ్బంది వచ్చేలోగానే,నిండు గర్బిణి కడుపు కోసేసి బిడ్డను ఎత్తుకెళ్ళిపోతూండే పిచ్చివాడు తారకరత్న. సిటీలో ఈ తరహా కేసులు ఎక్కువ అవటంతో స్పెషల్ టాస్క్ పోర్స్ అధికారి వెంకట్(రబిబాబు) రంగంలోకి దిగిపోతాడు. అయితే తారకరత్నను పట్టుకుంటాడు రబిబాబు. అయితే అతని ఇంటరాగేషన్ జరుగుతూండగానే ఇంకో గర్భిణి కడుపు కోసేవేయడం,కడుపులో బిడ్డను ఎత్తుకుపోవటం జరుగుతుంది. అరెస్టు చేయబడ్డ వాడు కష్టడీలో ఉండగా బయిట ఎవరు ఈ నేరం చేస్తున్నాడు.మరో ప్రక్క రవిబాబుకి భార్య స్నేహ ఉంటుంది. ఆమె కూడా గర్భిణీనే. ఆమెను రక్షిస్తూ.. రవిబాబు ఈ కేసును ఎలా డీల్ చేసాడన్న దిసగా మిగతా కథనం నడుస్తుంది.ఈ చిత్రం ధ్రిల్లర్స్ అమితంగా ఇష్టపడేవారికి నచ్చిందంటున్నా,గర్భిణీల కడుపు కోయటం,బిడ్డను ఎత్తుకుపోవటం వంటి అంశాలు కన్సీవింగ్ గా లేవని చెప్తున్నారు. ఏదైమైనా భవ్యా క్రియేషన్స్ వారి ద్వితీయ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











