అల్లరి రవిబాబు 'అమరావతి' స్పెషలేమిటంటే..
అనసూయ,నచ్చావులే చిత్రాలతో మళ్ళీ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అల్లరి రవిబాబు తాజా చిత్రం అమరావతి. ఈ చిత్రం షూటింగును పూర్తిచేసుకుని ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.."ఇదొక థ్రిల్లర్. కథాకథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. నా మునుపటి చిత్రాలకు భిన్నంగా ఉండే సినిమా. ఇందులో పాటలనేవి ఉండవు. రీరికార్డింగే ఈ చిత్రానికి వెన్నెముక" అని చెప్పారు.ఈ చిత్రంలో భూమిక, స్నేహ, గద్దె సిందూర, రవిబాబు ప్రధాన పాత్రధారులుగా చేస్తున్నారు. తారకరత్నం సైకో లా కనిపించనున్నాడు.
శౌర్యం నిర్మించిన భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ ఈ 'అమరావతి' ని నిర్మిస్తున్నారు. నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత ఆనందప్రసాద్ మాట్లాడుతూ "ఈ సినిమా చూస్తుంటే ఒక హాలీవుడ్ సినిమాని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. థియేటర్ ట్రైలర్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. అన్ని కార్యక్రమాలూ పూర్తిచేసి, డిసెంబర్ తొలివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, పరుచూరి గోపాలకృష్ణ, జి.వి.విశ్వనాథ్ కాశీ, రాఘవ, మధు తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, సినిమాటోగ్రఫీ: సుధాకర్‌రెడ్డి, కూర్పు: శంకర్, కళ: నారాయణరెడ్డి. పాటలు లేకపోవటం,తారకత్న విలనీ ఈ చిత్రానికి స్పెషల్స్ అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











