ఓ హృదయం చేసిన అన్వేషణ('మనసారా' ప్రివ్యూ)
అంతా కొత్తవారితో అల్లరి రవిబాబు రూపొందించిన తాజా చిత్ర "మనసారా" ఈ రోజు విడుదల అవుతోంది. కేరళ నేపధ్యంలో నడిచే ఈకథలో హీరో విక్రమ్ (విక్రమ్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన స్టూడెంట్. ఓ పనిమీద కేరళ వెళ్ళిన అతను అక్కడ అంజలి (శ్రీదివ్య)ని తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఆమె కేరళలో ప్రాచీన పోరాట కళ అయిన కళయపట్టు యోధుల కుటుంబానికి చెందింది. దాంతో అతను అక్కడ ఇరుక్కుపోతాడు. తన ప్రేమను దక్కించుకోవటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో అంజలి కుటుంబంకనికరించిందా..? విక్రమ్ అడ్డంకులను ఎదుర్కొని తన ప్రేమని ఎలా దక్కించుకొన్నాడనేదే కథ.
ఇక ఈ చిత్రం హీరో విక్రమ్..నిర్మాత ప్రకాష్ బాబు కుమారుడు. హీరోయిన్ గా పరిచయమవుతున్న శ్రీ దివ్య తెలుగు అమ్మాయే. ఆమె కొన్ని టీవీ సీరియల్స్ లో నటించింది. అలాగే నచ్చావులే చిత్రానికి సంగీతం అందించిన శేఖర్ చంద్ర ఈ చిత్రానికి కూడా సంగీతం అందించారు. ఇక ఈ చిత్రంలో హైలెట్స్..సినిమాటోగ్రఫి, కళయపట్టు పోరాట సన్నివేశాలు.
ఇక ఈ చిత్రం గురించి దర్సకుడు మాట్లాడుతూ..షేక్ స్పియర్ కాలం నుంచి నేటి వరకూ ప్రేమకథలది ఒకే ఫార్ములా. అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం, కొన్ని కారణాలవల్ల విడిపోవడం, మళ్లీ కలవడం. "మనసారా" కథ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే...నేపథ్యం కొత్తగా ఉంటుంది. కేరళలోని రూరల్ ప్రాంతాల్లో చిత్రాన్ని తెరకెక్కించాం. కధగా చెప్పాలంటే..ఓ హృదయం మరో హృదయం కోసం చేసిన అన్వేషణ ఇది. ప్రేమికులకు ధైర్యం ఎక్కువ. తమ ప్రేమ ఎలాగైనా సాధించుకొంటాం అనే నమ్మకం ఉంటుంది. ఆ విషయాన్నే కొత్త కోణంలో చెబుతున్నాం అన్నారు.


Click it and Unblock the Notifications











