Don't Miss!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- News సీట్ల మార్పులో బీజేపీ కొత్త ట్విస్ట్- చంద్రబాబు నిర్ణయం ఏంటి..!!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్‌పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
అల్లరి రవిబాబు 'మనసారా' చిత్రం హైలెట్స్ ఇవే
షేక్ స్పియర్ కాలం నుంచి నేటి వరకూ ప్రేమకథలది ఒకే ఫార్ములా. అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం, కొన్ని కారణాలవల్ల విడిపోవడం, మళ్లీ కలవడం. "మనసారా" కథ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే...నేపథ్యం కొత్తగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ వెళ్లి...అక్కడ ప్రేమలో పడ్డ ఓ అబ్బాయి కథ ఇది. ఇప్పటి వరకూ కేరళ నేపథ్యంలో చాలా ప్రేమకథలు వచ్చాయి. కానీ ఇది ప్రత్యేకమైనది. కేరళలోని రూరల్ ప్రాంతాల్లో చిత్రాన్ని తెరకెక్కించాం. అక్కడి కల్చెరల్ ఫ్లేవర్‌లో సినిమా ఉంటుంది. అమ్మాయి, అబ్బాయి పాత్రల చుట్టూ అల్లుకున్న పాత్రలు, వాటి భావోద్వేగాలు ఈ సినిమాకు హైలైట్స్ అని దర్శకుడు అల్లరి రవిబాబు చెప్పారు. ఈ సినిమా ద్వారా విక్రమ్, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.
అలాగే కొత్తవారిని తీసుకోవటానికి కారణం చెప్తూ..ఈ సినిమాలో 90 శాతం కొత్తవారు నటించారు. అన్ని అర్హతలూ ఉండి, అవకాశాలు రాక, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న జెమ్స్ లాంటి కుర్రాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఈ సినిమా ద్వారా అవకాశం ఇచ్చాను. ఈ సినిమాలో హీరోయిన్గా పరిచయం అవుతున్న శ్రీదివ్య తెలుగమ్మాయి. సినిమాలో కేరళ అమ్మాయిగా కనిపిస్తుంది. చక్కగా యాక్ట్చేసింది అంటూ వివరించారు రవిబాబు. ప్రకాష్‌బాబు కడియాల మనసారా చిత్రానికి నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది.అలాగే అల్లరి రవిబాబు గతంలో అల్లరి, అనసూయ, అమరావతి. అమ్మాయిలు అబ్బాయిలు, నచ్చావులే,సోగ్గాడు లకు దర్శకత్వం వహించారు.