బట్టలు విప్పలేదని వెళ్లిపోమన్నాడు: నటుడు వినయ్ వర్మపై ఆరోపణలు, నటి జీవిత రియాక్షన్!

Recommended Video

Jeevitha Rajasekhar Reacted On Vinay Varma's Issue || Filmibeat Telugu

సినీ నటుడు, థియేటర్ పర్సనాలిటీ వినయ్ వర్మ మీద సంచలన ఆరోపణలు చేసింది ఓ అమ్మాయి. హైదరాబాద్ నారాయణగూడలో సూత్రధార్ యాక్టింగ్ స్కూల్ నిర్వహిస్తున్న అతడు..తాను చెప్పినట్లు బట్టలు విప్పలేదనే కారణంతో ఓ అమ్మాయిని తన క్లాస్ నుంచి బయటకు గెంటేయడమే ఇందుకు కారణం.

బాధితురాలు అచ్చిన్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. ''ఏప్రిల్ 3న తాను వినయ్ వర్మ యాక్టింగ్ వర్క్ షాపులో జాయన్ అయ్యానని, ఏప్రిల్ 15 వరకు అంతా సాఫీగా సాగిందిని... ఆ రోజు సర్ డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేయమనడంతో హీట్ ఎక్కువగా ఉండటం వల్ల అలా చేయమన్నారేమో అనుకున్నాను. కానీ అందరినీ బట్టలు విప్పేయమనడంతో షాకైనట్లు' వెల్లడించింది.

విప్పకుంటే వెళ్లిపో అన్నాడు

విప్పకుంటే వెళ్లిపో అన్నాడు

‘మొత్తం 9 మందిలో ఏడుగురు అబ్బాయిలు, ఇద్దరం అమ్మాయిలం ఉన్నాం. బాయ్స్ అందరూ తమ బట్టలు విప్పేశారు. కానీ మేము అలా చేయమని చెప్పాం. దీంతో ఆయన ఆగ్రహంగా... నువ్వు ఆ పని చేయకుంటే నా క్లాస్ నుంచి వెళ్లిపో, రేపటి నుంచి రావొద్దు అని చెప్పేశారు.' అని అచ్చిన్ తెలిపారు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు

మరో అమ్మాయి భయపడి విప్పేసింది. కానీ నాకు అలా చేయడం ఇష్టం లేదు, అందుకే బయటకు వచ్చేశాను అని అచ్చిన్ వెల్లడించారు. వినయ్ వర్మ మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.

వినయ్ వర్మ ఏమన్నారంటే..

వినయ్ వర్మ ఏమన్నారంటే..

తాను 20 ఏళ్లుగా యాక్టింగ్ స్కూల్ రన్ చేస్తున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా ఉన్నాను. నాపై ఎలాంటి రీమార్క్ లేదు. క్లాత్స్ విప్పడం కూడా నటనలో భాగమే. ఆమెకు చేయడం ఇష్టం లేకుంటే వెళ్లిపో అన్నాను. అన్నింటికీ హరాస్మెంట్ అని చెప్పడం సరికాదు. ఆమెను ఫోర్స్ చేయలేదు, టచ్ కూడా చేయలేదు అని వినయ్ వర్మ స్పష్టం చేశారు.

జీవిత ఏమన్నారంటే...

జీవిత ఏమన్నారంటే...

ఈ సంఘటనపై నటి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవిత మాట్లాడుతూ... ‘‘ఆమెను నేను అన్ని విషయాలు అడిగాను. నిన్ను కొట్టడం కానీ, హరాస్మెంట్ చేయడం చేశారా? అంటే అలాంటిదేమీ లేదని తెలిపింది. 28 డేస్ యాక్టింగ్ కోర్స్ కోసం రూ. 25 వేలు కట్టిందట. జాయిన్ అయినప్పుడు వారు నీట్‌గా, నిండుగా ఉండే బట్టలు వేసుకుని రావాలని చెప్పారట. బట్టలు విప్పకుంటే వెళ్లిపో, రేపటి నుంచి రావొద్దు అని అనడం బ్లాక్ మెయిల్ లాగా అనిపించిందని ఆ అమ్మాయి చెప్పింది.'' అని జీవిత తెలిపారు.

సినిమా ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడటం సరికాదు: జీవిత

సినిమా ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడటం సరికాదు: జీవిత

‘‘నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, వారు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఆడ పిల్లలకు సెక్యూరిటీ కావాలనే విషయాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ ఏ ఇన్సిడెంట్ జరిగినా? సినిమా ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడటం, ఇక్కడ బట్టలిప్పితేనే పనులు జరుగుతాయి అనే విధంగా చూడటం సరికాదు.' అని జీవిత అన్నారు.

వినయ్ వర్మ

వినయ్ వర్మ

దాదాపు 30 సంవత్సరాల నుంచి యాక్టింగ్ ఫీల్డులో ఉన్న వినయ్ వర్మ పలు తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. 20 సంవత్సరాల నుంచి ఆయన సూత్కధార్ అనే యాక్టింగ్ స్కూల్ రన్ చేస్తున్నారు. అచ్చిన్ సంఘటనతో ఈ యాక్టింగ్ స్కూల్ వివాదంలో ఇరుక్కుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X