For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది సంస్కారం కాదు, ఎవరి ఫ్యాన్స్ అయితే ఏంటి, నాకు అసహ్యం: అల్లు అర్జున్ ఫైర్

    By Bojja Kumar
    |
    మళ్ళీ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన బన్నీ !

    మెగా ఫ్యామిలీకి చెందిన సినిమా ఫంక్షన్లు జరిగినపుడు అభిమానులు గోల చేయడం, వారి మూలంగా వేదిక మీద మాట్లాడేవారు ఇబ్బంది పడటం లాంటివి గతంలో చూశాం. ఓ సారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గోల చేస్తుంటే బన్నీ గట్టి వార్నింగే ఇచ్చాడు. అప్పట్లో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా మరోసారి బన్నీకి అలాంటి సందర్భమే ఎదురైంది. ఈ నేపథ్యంలో బన్నీ మరోసారి సహనం కోల్పోయారు.

     మళ్లీ ఈ ఘటన ఎక్కడ జరిగింది?

    మళ్లీ ఈ ఘటన ఎక్కడ జరిగింది?

    అల్లు శిరీష్‌, సుర‌భి, సీర‌త్ క‌పూర్, అవ‌స‌రాల శ్రీనివాస్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `ఒక్క క్ష‌ణం`. వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా బన్నీ అభిమానుల తీరుతో విసిగిపోయారు.

    ఇది సంస్కారం కాదంటూ బన్నీ ఫైర్

    ఇది సంస్కారం కాదంటూ బన్నీ ఫైర్

    తాను మాట్లాడుతుంటే అభిమానులు గోల చేయడంతో బన్నీ సహనం కోల్పోయారు. "ఫ్యాన్స్ అందరికీ ఒకటే రిక్వెస్ట్... ఎవరైనా మాట్లాడేపుడు ఎదురు మాట్లాడటం సంస్కారం కాదు. ఫంక్షన్ పెట్టిందే సరదాగా అరవడానికి... కానీ మనిషి మాట్లాడేపుడు కాదు. అది బేసిక్ రెస్పెక్ట్." అంటూ బన్నీ ఫైర్ అయ్యారు.

     ఎవరు అడ్డం వచ్చినా పేరెత్తి చెబుతా

    ఎవరు అడ్డం వచ్చినా పేరెత్తి చెబుతా

    "సినిమా వేడుకల్లో అయినా సరే, మరెక్కడ అయినా సరే.... ఒకరి ఫీలింగ్ చెప్పుకునేపుడు అడ్డు పడకూడదు. ఎవరి విషయంలో అయినా అంతే. మాట్లాడేపుడు ఎవరైనా అడ్డం వస్తే వారి పేరు ఎత్తిమరీ చెబుతా. ప్లీజ్ డోంట్ డ్రిస్ట్రబ్ మి. ఆ విషయంలో నేను ట్రిప్ అవుతా, గతంలో జరిగిన ఇష్యూల గురించి మీకు అందరికీ తెలుసు." అంటూ బన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

     చివర్లో కూల్ అయిన బన్నీ

    చివర్లో కూల్ అయిన బన్నీ

    తన ప్రసంగం ముగిసిన తర్వాత బన్నీ కాస్త కూల్ అయ్యారు. అభిమానులు కూడా కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఇపుడు అరిస్తే బావుంటుంది అంటూ వారిని ప్రోత్సహించారు. తాను ఎందుకు అలా అనాల్సి వచ్చిందో వివరించారు.

     కొప్పడ్డాను, మనసులో పెట్టుకోవద్దు

    కొప్పడ్డాను, మనసులో పెట్టుకోవద్దు

    నేను మాట్లాడుతుంటే మీరు అరిచినందుకు నేను కాస్త హర్ట్ అయ్యాను. కొంచెం కోప్పడ్డాను. ఇదేమీ మీరు మనసులో పెట్టుకోవద్దు.... అని అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు. వెంటనే మైక్ అందుకున్న శిరీష్ నువ్వు ఇంకా నా పేరు సూర్య సినిమా క్యారెక్టర్లో ఉన్నావు కాబట్టే అలా బిహేవ్ చేశావు. అది అర్జున్ కాదు, సూర్య అంటూ చమత్కరించారు.

    ఇది నేను ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను

    ఇది నేను ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను

    ఇది నేను ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నేను చెప్పేది ఒకటే. ఎప్పుడూ గుర్తుంచుకోండి. పబ్లిక్ ఫంక్షన్లు పెట్టేదే ఈ సరదా కోసం. కానీ ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత, వారి ఫీలింగ్స్ చెప్పుకుటుంటే అరవడం, వారికి అడ్డు పడటం సంస్కారం కాదు.... ఇపుడు అలాంటి సందర్భంగా వచ్చింది కాబట్టి చెబుతున్నాను అని బన్నీ తెలిపారు.

     నా ఫ్యాన్స్ అయినా అసహ్యంగా ఫీలవుతాను

    నా ఫ్యాన్స్ అయినా అసహ్యంగా ఫీలవుతాను

    ‘‘సినిమా ఫంక్షన్లలో ఒకరు మాట్లాడుతుంటే అరవకండి. అది ఎవరి ఫ్యాన్స్ అయినా సరే. నా ఫ్యాన్స్ వల్ల అలా జరిగింది అని తెలిసినా నేను సహస్యంగా ఫీలవుతాను. అది నేను చెప్పాలనుకుంది... థాంక్సూ.'' అంటూ బన్నీ ముగించారు.

    English summary
    Stylish star Allu Arjun graced his brother Allu Sirish's upcoming film Okka Kshanam pre-release function as chief guest. Allu Ajun requests his fans don't shout when some one speaks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X