కేబినెట్ తేలాకే...చిరు 150వ సినిమా: అల్లు అరవింద్

By Srikanya

హైదరాబాద్: ఇప్పుడు సినీ వర్గాల్లోనే కాక, రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ చిరంజీవి 150 చిత్రం. వివి వినాయిక్ దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందుతుందంటూ వార్తలు వస్తున్న నేఫధ్యంలో అల్లు అరవింద్ ని మీడియా ఈ చిత్రం విషయమై ప్రశ్నించింది. సెప్టెంబర్ లోనే సినిమా చేసేది లేనిది ప్రకటిస్తాం అని అన్నారు. దానికి కారణాలు పొలికటల్ అని సమాచారం.

ఇక అంత డిలే కావటానికి కారణం విశ్లేషిస్తూ....ఇప్పుడే రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యాయి..సెంటర్లో కేబినిట్ సర్ధుబాట్లు జరుగుతాయి..చిరంజీవి ..కేబినెట్ బెర్త్ రేసులో ఉన్నారు. ఈ నెలాఖరకు పూర్తి రిజల్ట్ తేలుతుంది. ఒకవేళ చిరంజీవి మినిస్టర్ అయితే ఆయన గవర్నమెంట్ నుంచి ఫర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నారు. ఇక పరుచూరి బ్రదర్శ్ ఈ విషయం మాట్లాడుతూ...కొద్ది నెలలు క్రిందటం మేము ఆ సినిమా గురించి మాట్లాడాం కానీ ...అప్పటి నుంచి ఆయనతో టచ్ లో లేము అని చెప్పారు.

ఇక ఈ చిత్రం గురించి పార్టీకి లబ్ధి చేకూరడంతో పాటు సామాజిక సందేశాన్ని అందించే కథ లభిస్తే ఇప్పటికిప్పుడు నటించేందుకు సిద్ధమని చిరంజీవి ఆ మధ్యన తిరుపతిలో ప్రకటించారు. త్వరలో కార్యరూపం దాల్చనున్న చిరంజీవి పునరాగమ ప్రక్రియ వెనుక భారీ కసరత్తే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లోనే కాక సినీ వర్గాల్లో సైతం చిరు ..రీ ఎంట్రీపైనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఠాగూర్,స్టాలిన్ వంటి సామాజిక సందేశం ఉన్న సబ్జెక్టులతో వచ్చే అవకాశముందని చెప్పుకుంటున్నారు. అలాగే చిరంజీవి సైతం కథ,దర్శకుడు ఖరారు అయ్యేవరకూ ఆ విషయం సీక్రెట్ గా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న తన చిత్రాన్ని ఎవరికి టార్గెట్ చేయాలి...తన అభిమానులను సంతృప్తిపరచే విధంగా సీన్స్ ఉంచాలా వద్దా అనే విషయాలపై తర్జనబర్జన పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. రచ్చకి పనిచేసి హిట్ కొట్టిన పరుచూరి బ్రదర్శ్ ... ఈ సినిమాతో మళ్లీ తమ కలం బలం ఏమిటో చూపాలని ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అలాగే సినిమాలో రాజకీయ అంశాలను ఏ మేరకు స్పృశించాలనే విషయమై కూడా ఓ అవగాహనకు వస్తే బెస్ట్ అని వారు చిరంజీవికి సూచించినట్లు..చిరంజీవి సైతం.... తన వారితో మాట్లాడి ఫైనలైజ్ చేస్తానని చెప్పటం జరిగిందని చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X