twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జంజీర్‌' రీమేక్ పై అల్లు అరవింద్‌

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్‌చరణ్‌ తన ఐదో చిత్రం 'జంజీర్‌'తో హిందీ చిత్ర రంగంలోకి ప్రవేశించాడు. ఇది ఘన విజయం సాధించడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేశారు అల్లు అరవింద్. అలాగే తాజాగా విడుదల చేసిన 'తుపాన్‌' ట్రైలర్‌ విజయవంతమైందని.... అభిమానులు అన్ని ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి మరీ ఎందరో చాలా బాగుందని కితాబిస్తున్నారన్నారని చెప్పారు.

    రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకల్ని జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులో ఘనంగా నిర్వహించారు. చిరంజీవి యువత వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి రవణం స్వామినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దుబాయ్‌నుంచి సైతం అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దాదాపు 650 మంది అభిమానులు రక్తదానం చేశారు. సినీ నిర్మాత అల్లు అరవింద్‌ రామ్‌చరణ్‌ ఫోటోతో ఏర్పాటు చేసిన 50 కేజీల కేకును కోశారు. ఈ సందర్బంగా చిరంజీవి, రామ్‌చరణ్‌ అభిమానులుద్దేశించి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    అలాగే... రామ్‌చరణ్‌ విదేశాల్లో ఉన్నప్పటికి చిరంజీవి, రామ్‌చరణ్‌పై వారికున్న అభిమానంతో విదేశాల నుంచి సైతం అభిమానులు ఈ వేడుకలకు హాజరవడం అభినందనీయమన్నారు. రామ్‌చరణ్‌ జన్మదినం సందర్భంగా మూడు రోజులుగా 66 ముఖ్య పట్టణాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి 26వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీకి అప్పగింనట్లు రవణం స్వామినాయుడు తెలిపారు.

    వికలాంగులకు చక్రాల కుర్చీలు, పేద మహిళలకు కుట్టుమిషన్లు, చిన్నారులకు మ్రాట్రిక్‌ ఫుడ్స్‌ సైతం రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రగ్‌ కంట్రోల్‌ మాజీ సంచాలకుడు ఎం.వెంకట్‌రెడ్డి, ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు ఎం.రాఘవరావు, కార్యదర్శులు దాడి లక్ష్మినారాయణ, కొండల్‌రావు, చరణ్‌ అభిమాన సంఘ నేతలు గంగాధర్‌, చందు, తేజ, దిలీఫ్‌, జితేంద్ర, మోసిన్‌ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Allu Aravind says that his nephew Ram Charan's Zanjeer Remake will give super Hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X