టాలీవుడ్‌లో మరో స్టూడియో.. అల్లు అరవింద్ ప్లాన్ మామూలుగా లేదు!!

తెలుగు సినీ ఇండస్ట్రీ హిస్టరీలో అల్లు రామలిగంయ్యది ఓ శకం. ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలం నుంచి వెండితెరపై నవ్వులు పూయిస్తు వచ్చారు. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అల్లు అరవింద్ కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. రెండు మూడు సినిమాల్లో అలా మెరిసినా కూడా నిర్మాణం రంగంలో అత్యున్నత స్థానాన్ని సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌కు ఉండే బ్రాండ్ వ్యాల్యూనే వేరు.

99వ జయంతి..

99వ జయంతి..

టాలీవుడ్‌లో ఇప్పటికే అల్లు వారి బ్రాండ్ స్పష్టంగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ కూడా తన అల్లు బ్రాండ్‌పై నిలబేందుకు ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది. నిర్మాతగా అల్లు అరవింద్, హీరోగా అల్లు అర్జున్ టాప్ ప్లేస్‌లో ఉండి అల్లు ఫ్యామిలీ సత్తా చాటుతున్నారు. నేడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఓ కీలక ప్రకటన చేశారు.

మా ప్రియమైన..

మా ప్రియమైన..

అక్టోబర్ 1 మాకెంతో ప్రియమైన అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి.. ఈ సందర్భంగా అల్లు ఫ్యామిలీ.. అల్లు స్టూడియోస్ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు ప్రకటిస్తున్నాం అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ఈ వేడుకలో అల్లు అరవింద్‌తో పాటు అల్లు బ్రదర్స్ పాల్గొన్నారు. ఆయన వారసత్వాన్ని, లెగసీని ముందుకు తీసుకెళ్తాము.. ఈ స్టూడియో ఆయనకు అంకితం చేస్తున్నాం.. మీ అందరి ఆశీర్వాదంతోనే ఈ పనులు ప్రారంభిస్తున్నాం అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.

 ఆయన జ్ఞాపకార్థం

ఆయన జ్ఞాపకార్థం

మా కుటుంబం అంతా సినిమాను ప్రేమిస్తుంటుంది. మా తాత లెగసీని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన జ్ఞాపకార్థం ఈ స్టూడియోను నిర్మిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదంతో పునాది వేశాం. అని అల్లు స్టూడియోఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.

Recommended Video

Nikhil Siddharth Stylish Look After Marriage
ఇప్పటికే ఉన్న స్టూడియోలు..

ఇప్పటికే ఉన్న స్టూడియోలు..

రామోజీ ఫిల్మ్ సిటీ, పద్మాలయా, రామానాయుడు స్టూడియో, నానక్ రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియో, మరోవైపు నగరం నడి బొడ్డున వున్న అన్నపూర్ణ సినీ స్టూడియోస్‌, దానికి అనుబంధంగా అక్కినేని ఫ్యామిలీ నిర్మించిన సెవెన్ ఎకర్స్ స్టూడియోస్‌లో సినిమాలతోపాటు టీవీ సీరియళ్ళు, టీవీ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున షూటింగులు జరుపుకుంటున్నాయి. అయితే మరి ఈ అల్లు స్టూడియో ఎక్కడ నిర్మిస్తారు..ఎలా ఉండబోతోందన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X