దాడి దారుణం, ఒకేసారి ఆపలేం : అల్లు అరవింద్

డబ్బింగ్ సీరియళ్లను క్రమేణా ఆపుతామని ముందే చెప్పామని, ఒకేసారి ఆపితే చానల్ దెబ్బతింటుందని, చానల్ పై ఆధారపడ్డ 300 మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయని అల్లు అరవింద్ చెప్పారు. క్రమేణా ఆపుతామని చెప్పినా దాడి చేయడం దారుణం అన్నారు.
అయితే టీవీ ఆర్టిస్టులంతా ఈ దాడి చేసారని భావించడం లేదు, తెర వెనక ఉండి ఎవరో దుండగులు ఈ దాడి చేసినట్లు భావిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యల వల్ల సమస్యలు పరిష్కారం కావదని అల్లు అరవింద్ పేర్కొన్నారు. శాంతియుతంగా ఉంటేనే అందరికీ మంచిదన్నారు.
దాడి వివరాల్లోకి వెళితే...జూబ్లీహిల్స్‌లోని మాటీవీ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆందోళన కారులు డబ్బింగ్ సీరియళ్లను నిలిపి వేయాలంటూ దాడికి పూనుకున్నారు. మాటీవీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కార్యాలయంలో అద్దాలతో పాటు, ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ ఘటనలో కొందరు మాటీవీ సిబ్బంది కూడా గాయపడ్డట్లు సమాచారం. కార్యాలయం ఆవరణలో నిలిచి ఉన్న కార్ల అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఆందోళన కారులు రెండు కార్లలో వచ్చి ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











