twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సరైనోడుకు మించిన హిట్.. బోయపాటితో అల్లు అరవింద్ మూవీ.. కార్తికేయ క్రేజీ రిక్వెస్ట్

    |

    బోయపాటి శ్రీను.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్న ఈ దర్శకుడు.. అనతి కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపాడు. కానీ, ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉంటున్నాడు. నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించినా ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఓ బడా ప్రొడ్యూసర్ మరిచిపోలేని గిప్ట్ ఇచ్చారు.

     బాలయ్యతో సినిమా

    బాలయ్యతో సినిమా

    ‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా గురించి ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ప్రత్యేకంగా ఓ ఏవీని కూడా ప్లే చేశారు. అంతేకాదు, ఈ మధ్య బాలయ్య పుట్టిన రోజునా ఈ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది.

    ఆగిపోయినట్లు రూమర్లు

    ఆగిపోయినట్లు రూమర్లు

    ప్రకటించడమైతే ప్రకటించారు కానీ, ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం లేదని అనుకుంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలకృష్ణ ఈ సినిమానే చేయాల్సి ఉన్నా.. దీన్ని ఎందుకనే పక్కన పెట్టేశారని ఫిలింనగర్‌లో చెప్పుకుంటున్నారు. అందుకే కేఎస్ రవికుమార్‌తో ఆయన సినిమా చేస్తున్నాడని కూడా ఓ టాక్ వినిపిస్తోంది. దీని తర్వాత కూడా బోయపాటితో సినిమా చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేయడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

    అల్లు అరవింద్ ప్రకటన

    అల్లు అరవింద్ ప్రకటన

    కార్తికేయ హీరోగా నటించిన ‘గుణ 369' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో బోయపాటిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ ‘‘ఈ ఫంక్షన్‌కు శిష్యుడి కోసం వచ్చిన బోయపాటి గారికి అందరూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. నేను ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే.. నాకు బోయపాటి గారు ‘సరైనోడు'తో సూపర్ హిట్ ఫిల్మ్ ఇచ్చారు. మా కాంబినేషన్‌లో మళ్లీ ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

    ఛాన్స్ కావాలన్న కార్తికేయ

    ఛాన్స్ కావాలన్న కార్తికేయ

    అల్లు అరవింద్.. బోయపాటితో సినిమా చేస్తున్నానని ప్రకటించగానే హీరో కార్తికేయ కలుగజేసుకుని.. ‘‘సార్.. మీరు బోయపాటి గారు కాంబినేషన్ అన్నారు కదా.. ఆ సినిమాలో నాకేమైనా అవకాశం ఇస్తారా'' అని అడిగాడు. దీనికి అల్లు అరవింద్ వెంటనే ‘వెల్‌కమ్ టూ గీతా ఆర్ట్స్' అంటూ చెప్పి నవ్వులు పూయించారు.

    English summary
    Tollywood Big Producer Allu Aravind Attend Guna 369 Trailer launch event. In This Film Karthikeya Plays Lead Role. And Boyapati Srinu assistant Arjun Jandhyala Directs This Film. Allu Aravind Announce A Movie With Boyapati.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X