‘బద్రినాథ్’ పై అల్లు అరవింద్ అనౌన్స్ మెంట్ కరెక్టేనా...!?
దేశముదురు, పరుగు వంటి కమర్షియల్ హిట్స్ తర్వాత 'వేదం' చిత్రానికి మాత్రం ఆర్టిస్ట్ గా అందరి ప్రశంసలు అందుకున్న అల్లు అర్జున్ కి కమర్షియల్ గా మరో హిట్ లేదు. ఆ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ 5లో నిలిచే చిత్రమని గుణశేఖర్ చెప్పుకొచ్చిన 'వరుడు" డిజాస్టర్ అయింది. 'మగధీర" లాంటి బ్లాక్ బస్టర్ ఇద్దామని అల్లు అరవింద్, వినాయక్ కలిసి చేసిన 'బద్రినాథ్" వృధా ప్రయాస అయింది. అయితే ఈ రెండు సినిమాలు అల్లు అర్జున్ కి ఒక విషయంలో హెల్ఫ్ అయ్యాయని చెప్పాలి. శుక్రవారం విడుదలైన బద్రినాథ్ ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్..అయితే మొదటిరోజే ప్రేక్షకులనుండి డివైండ్ టాక్ తో ఏడుకోట్ల యాభైలక్షలు కలెక్షన్ రాబట్టింది. దాని తర్వాత ఈ మూడు రోజుల లెక్షన్స్ Rs.16.5కోట్లు అని అల్లు అరవింద్ అనౌన్స్ చేశారు.మొదటి మూడు రోజుల్లో ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే 14.1 కోట్లు కలెక్షన్ రాబట్టింది. నిజాం లో 5కోట్లు, సీడెడ్ 3.5కోట్లు, ఆంధ్రాలో 5.6కోట్లు..
'వరుడు" చిత్రానికి గుణశేఖర్ తీసుకొచ్చిన హైఫ్ వల్ల ఆ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అప్పటివరకు బన్ని సినిమాల ఓపెనింగ్స్ విషయంలో అదే టాప్ అయింది. ఇప్పుడు బద్రినాథ్ వరుడు చిత్రం సాధించిన ఓపెనింగ్స్ ని బీట్ చేసింది. తొలి మూడు రోజులు అన్ని ఏరియాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించింది. సోమవారం నుంచి స్కూల్స్ ఒపెన్ అవుతుండడంతో శుక్ర, శని, ఆది వారాలు బద్రినాథ్ థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. 'వరుడు" వారం రోజుల్లో ఎంత కలెక్షన్ చేసిందో దాన్ని బద్రినాథ్ మూడు రోజుల్లోనే అధిగమించింది. అన్ని ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి వుంది. అయితే సోమవారం అన్ని ఏరియాల్లోనూ ఒక్కసారిగా కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. ఆ విధంగా బన్నీకి 'బద్రినాథ్" మూడు రోజుల ముచ్చటగానే మిగిలిపోయిందని చెప్పాలి...


Click it and Unblock the Notifications











