రామ్ చరణ్ - అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ రెడీ.. మూవీ అనౌన్స్ చేసిన అల్లు అరవింద్!

రామ్ చరణ్, అల్లు అర్జున్.. వీరు ఇప్పుడు గ్లోబర్ స్టార్స్. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోగా.. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. మరి వీరు ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే... ఫ్యాన్స్ ఆగుతారా.. వారి ఆనందానికి హద్దే ఉండదు. వీరి కాంబోలో అప్పట్లో ఎవడు అనే చిత్రం వచ్చింది. కానీ అందులో అల్లు అర్జున్ పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంది. ఫుల్ లెంగ్త్ లో వీరి కాంబోలో సినిమా వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు. ఆ విషయాన్ని స్వయంగా అల్లు అరవిందే చెప్పుకువచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే...

రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబోలో సినిమా వస్తే... మెగా ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. ఇద్దరూ గ్లోబల్ ఇమేజ్ ఉన్న స్టార్స్... కచ్చితంగా నేషనల్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో ఎవడు చిత్రం వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. అప్పటికీ వీరికి నేషనల్ వైడ్ గుర్తింపు రాలేదు కానీ టాలీవుడ్ లోస్టార్ హీరోలు. ఇక ఎవడు చిత్రంలో బన్నీ క్యారెక్టర్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది.

Allu Aravind announcing Allu Arjun Ram Charan multistarrer Movie Video Goes Viral

కానీ ఆ పాత్రనే ఆ సినిమాకు హైలెట్. మరి ఇప్పుడు ఇద్దరూ గ్లోబల్ స్టార్స్. ఒకరేమో ఆర్ఆర్ఆర్ చిత్రంతో సంచలనం సృష్టిస్తే.. మరొకరు పుష్పతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. రామ్ చరణ్... రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ ఆర్ చిత్రంలో అల్లురి సీతారామారాజు క్యారెక్టర్ చేశాడు. అయితే ఈ క్యారెక్టర్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అంతేనా ఇప్పటికీ నార్త్ వాళ్లంతా అల్లురి సీతారామారాజు అంటే రాముడిగా కోలుస్తున్నారు. రాముడి గెటప్ లో రామ్ చరణ్ ను చూసి ఊగిపోయారు.

Allu Aravind announcing Allu Arjun Ram Charan multistarrer Movie Video Goes Viral

మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రూల్ సినిమా ఎంత హిట్ అయిందో చెప్పనవసరం లేదు. ఏకంగా పలు దేశాల్లో సంచలనం సృష్టించింది. క్రికెట్ స్టార్స్ నుంచి రాజకీయా నాయకుల వరకు పుష్పస్వాగ్ తో అదరగొట్టారు. ఎక్కడ చూసిన తగ్గేదేలే డైలాగ్ వినిపించేది. అంతలా ఆ సినిమా జనాల్లోకి వెళ్లింది. ఇప్పుడు పుష్ప 2తో మరింత సంచలనం సృష్టించేందుకు రెడీ అయిపోయాడు అల్లు అర్జున్. మరి వీరి కాంబోలో సినిమా వస్తే.. నెక్ట్స్ లెవెల్ అంతే. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాలు లేవ్.. బాక్సులు బద్దలు అవ్వాల్సిందే.

అయితే వీరి కాంబోలో సినిమా పదేళ్ల క్రితమే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని అల్లు అరవింద్ చెప్పుకువచ్చారు. అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్.. అలీతో తన మనసులోని కోరికను బయటపెట్టాడు. అందులో అల్లు అరవింద్ మాట్లాడుతూ... నాకో కోరిక ఒకటి ఉందయ్యా... బన్నీ చరణ్ కలిసి సినిమా మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఉంది. దానికి నేను ఓ టైటిల్ రిజిస్టర్ చేశాను. అది కూడా పదేళ్ల క్రితమే. దాని పేరు చరణ్ అర్జున్. ఆ టైటిల్ ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేస్తూనే ఉన్నాను. ఎప్పటికైనా ఆశ అది జరుగుతుందని.. అంటూ చెప్పుకువచ్చారు.

అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ నెట్టింట మరోసారి వైరల్ గా మారాయి. మరి అల్లు అర్జున్, రామ్ చరమ్ ఇద్దరు గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మరి ఆ లెవెల్ స్ట్రిప్ట్ దొరికితే.. ఈ పేరుతో సినిమా వచ్చే అవకాశం ఉంది. మరి ఎప్పుడెప్పుడూ వస్తుందా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X