twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు ప్రమాణంలో చరణ్, ఉపాసన...150వ సినిమా లేనట్లేనా?

    By Bojja Kumar
    |

    న్యూఢిల్లీ : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా నిమితులైన సంగతి తెలిసిందే. ఆదివారం ఢిల్లీలో ఉదయం 11.45 గంటలకు మెగాస్టార్ ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనతో పాటు మరో 21 మంది కూడా మంత్రులుగా ప్రమాణం చేసారు. మెగాస్టార్ కేంద్ర మంత్రి కావడంపై ఇటు కుటుంబ సభ్యులు, అటు అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.

    చిరంజీవి జీవితంలో ఎంతో ముఖ్యమైన ప్రమాణ స్వీకార ఘట్టాన్ని వీక్షించేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవి సతీమణి సురేఖ, బావమరిది అల్లు అరవింద్, తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒకప్పుడు చిరంజీవి ప్రజారాజ్యంలో యూత్ లీడర్ గా ఉన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం మిస్ అయ్యారు. ఆయన విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయారు.

    ఆ సంగతి పక్కన పెడితే....చిరంజీవి కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో చిరు 150వ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో ఆయన మరింత బిజీబిజీగా గడుపుతారని, ఇప్పట్లో చిరంజీవికి 150వ సినిమా చేసే తీరిక అస్సలు ఉండదనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.

    2014 ఎన్నికల తర్వాతనే మళ్లీ ఆయన 150వ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈచిత్రానికి ఠాగూర్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ స్వయంగా ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు.

    English summary
    Tollywood Megastar Chiranjeevi has now turned the Union Minister for Tourism. The new Union Cabinet Ministers' oath ceremony took place at 11.45 am in New Delhi on Sunday, October 28. Along with 21 other Ministers, Chiranjeevi took oath on the occasion. It was a historical moment for his family. His wife Surekha, Allu Aravind, Ram Charan and Upasana were present at the ceremony to witness this moment. But Chiru's brother Pawan Kalyan, who has been youth leader of PRP, gave a miss to this event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X