యువ దర్శకుడిని బోయపాటితో పోల్చిన అల్లు అరవింద్

'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ - అనగ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'గుణ 369'. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

అలాగే 'గుణ 369' ట్రైలర్ గురించి, ఈ కార్యక్రమానికి రావడానికి గల కారణాలను గురించి ఆయన వెల్లడించారు. ''ఈ ట్రైలర్ చూడగానే బోయపాటి గారి సినిమా గుర్తొచ్చింది. ఈ సినిమా డైరెక్టర్ మాకు బాగా సుపరిచితులు. మా 'సరైనోడు'కు డైరెక్టర్ వెనుక వెన్నుదన్నుగా ఉండి, అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. అటువంటి కెపాసిటీ ఉన్న దర్శకుడు ఈ సినిమాను తీశారు. ఇక, ఇద్దరు నిర్మాతల గురించి చెప్పుకుంటే.. వీళ్లకు సినిమా తీయడం కొత్తేమో కానీ, సినిమా ఇండస్ట్రీ కొత్త కాదు'' అని చెప్పుకొచ్చారు.

 Allu Aravind Comments On Arjun Jandhyala

అంతేకాదు, ''నేను ఈ ప్రోగ్రాంకు రావడానికి ముఖ్య కారణం తిరుమల్ రెడ్డి గారు. అనిల్ గారు ఈయన స్నేహితులు. ఇరవై ఏళ్లుగా మా ప్రయాణం ఉంది ఆర్పీకి. ఈ ఆర్పీకి సినిమాకి సంబంధం ఏంటి అనుకుంటారేమో.. ఇది ఫస్ట్ జనరేషన్.. తిరుమల్ సెకెండ్ జనరేషన్. నేను రెగ్యులర్‌గా కలిసే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అందులో తిరుమల్ ఒకరు.. శ్రీను మరొకరు. మేము ముగ్గురం మంచి స్నేహితులం. నా దగ్గరకు వచ్చి మంచి కథ వచ్చింది.. పలానా దర్శకుడు అని చెప్పినప్పుడు వెల్‌కమ్ చేశాను. వాస్తవానికి నేను ఎప్పటి నుంచో తిరుమల్‌ను రమ్మని చెబుతున్నాను. ఆయనకు ఎలా డీల్ చేయాలో తెలుసు. అందుకే అతడిని ఎంకరేజ్ చేస్తుండేవాడిని. '' అని అల్లు అరవింద్ వెల్లడించారు.

ఇక, ఆఖర్లో చిత్ర హీరో గురించి కూడా మాట్లాడారు. ''సినిమా హీరో కూడా చాలా బాగా చేశాడని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. అతడి మొదటి సినిమా 'ఆర్ఎక్స్ 100'లో చూసిన దానికి, ఈ ట్రైలర్‌కు చూస్తే సినిమా బాగా ఆడుతుందని అనిపిస్తుంది. చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్'' అంటూ ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X