నా ముగ్గురు కొడుకుల భయం అదే.. ఆ మాట చెప్పినప్పుడల్లా.. అల్లు అరవింద్ కామెంట్స్

అల్లు వారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు రామలింగయ్య మొదలు కొని అల్లు శిరీష్ వరకూ అందరూ సుపరిచితులే. ఇక బడా నిర్మాత అల్లు అరవింద్ విషయానికొస్తే.. ఆయన మాట్లాడే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. అదే బాటలో తాజాగా జరిగిన ఓ వేడుకలో సరదాగా మాట్లాడి అందరినీ నవ్వించారు అల్లు అరవింద్. వివరాల్లోకి పోతే..

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌.. అల్లు అరవింద్ కామెంట్స్

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌.. అల్లు అరవింద్ కామెంట్స్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ప్రతిరోజూ పండగే' సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై నిర్మించారు. డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకొని విజయవంతం అయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విజయోత్సవంలో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ సరదాగా కొన్ని కామెంట్స్ చేశారు.

 అతనంటే అల్లు నిర్మాతకు భలే ఇష్టం..

అతనంటే అల్లు నిర్మాతకు భలే ఇష్టం..

గీతా ఆర్ట్స్ 2 బాధ్యతలను చూసుకుంటున్నారు బన్నీ వాస్. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఉండే ఈ నిర్మాత వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు 'ప్రతిరోజూ పండగే' ద్వారా మరో విజయం సాధించి అల్లు అరవింద్‌కు లాభాలు తెచ్చిపెట్టాడు. పైగా అల్లు అరవింద్‌కు కూడా బన్నీ వాస్ అంటే చాలా ఇష్టం.

మొత్తం నలుగురు కొడుకులు..

మొత్తం నలుగురు కొడుకులు..

'ప్రతిరోజూ పండగే' విజయోత్సవ సభలో మాట్లాడిన అల్లు అరవింద్.. తనకు బన్నీ వాస్ కూడా కొడుకు లాంటి వాడే అని, నాకు వీడితో కలిపి నలుగురు కొడుకులు అని చెప్పారు. అందరికీ బన్నీ, శిరీష్ మాత్రమే తెలుసు.. పెద్దోడు బాబీ కూడా ఉన్నాడని చెప్పిన అల్లు అరవింద్.. బన్నీ వాస్ కూడా కొడుకు లాంటి వాడే అని చెప్పారు.

ఆస్తులు రాసిస్తానేమో అని భయం..

ఆస్తులు రాసిస్తానేమో అని భయం..

అంతేగాక వయసును ఇలా అన్నప్పుడల్లా తన ఆస్తులు ఎక్కడ రాసిస్తానేమో అని ముగ్గురు కొడుకులు భయపడుతుంటారని చెప్పి తనదైన స్టైల్‌లో చమత్కరించారు అల్లు అరవింద్. ఇకపోతే ఇటీవలే తన ముగ్గురు కొడుకులకు అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X