twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అరవింద్ అలా చేయాలనుకున్నారు.. కానీ!

    |

    ఇటీవల అన్న పూర్ణ స్టూడియోస్ లో తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశమై తాజా పరిస్థితులని చర్చించిన సంగతి తెలిసిందే. రాంగోపాల్ వర్మ చేసిన నీచపు పనితో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. వర్మ కుట్రని మొదట బయటపెట్టిన వ్యక్తి అల్లు అరవింద్. ప్రెస్ మీట్ పెట్టి ఆయన వర్మని కడిగిపారేశారు. ఆ తరువాత మా అసోసియేషన్ కు పవన్ కళ్యాణ్ రావడం, మా సభ్యులకు అల్టిమేటం జారీ చేయడంతో మరుసటిరోజు అన్న పూర్ణ స్టూడియోస్ లో చిత్ర పరిశ్రమ సమావేశమై ఈ అంశం గురించి చర్చించిన సంగతి తెలిసిందే.

    ఆ సమావేశంలో అల్లు అరవింద్ తీసుకువచ్చిన ప్రతిపాదనని కొందరు ప్రముఖులు వ్యతిరేకించారట. అన్నపూర్ణ బ్యానర్ లో భాగమైన సుప్రియ ప్రధానంగా అల్లు అరవింద్ ప్రతిపాదనని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమపై నెగిటివ్ గా ప్రచారం చేస్తున్న కొన్ని ఛానల్స్ ని బహిష్కరించాలని, ఆ ఛానల్స్ కార్యక్రమాలకు చిత్ర పరిశ్రమ దూరంగా ఉండాలని అల్లు అరవింద్ కోరినట్లు తెలుస్తోంది.

    Allu Aravind did not get support from Tollywood

    గతంలో ఓ ఛానల్ యాంకర్ చిత్ర పరిశ్రమ గురించి అసభ్యంగా కామెంట్స్ చేసినప్పుడు తాను కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించానని సుప్రియ అన్నారు. కానీ ఆ సమయంలో తనకు ఎవరి నుంచి సహకారం లభించలేదని ఆమె వాదించినట్లు తెలుస్తోంది.

    English summary
    Allu Aravind did not get support from Tollywood. Allu Aravind wants to boycott those channels
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X