twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్జున్‌రెడ్డిని చూసి మైండ్ దొబ్బింది.. వారం బయటకు రాలేదు.. నేనేం చేస్తున్నానో... అల్లు అర్జున్

    |

    Recommended Video

    Vijay Deverakonda Makes Funny Comments with Allu Arjun

    విభిన్నమైన శైలి, యువతని ఆకట్టుకునే యాటిట్యూడ్ తో విజయ్ దేవరకొండ అంతకంతకు తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. విజయ్ దేవర కొండ, రష్మిక నటించిన గీత గోవిందం చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఆదివారం జరిగిన ఆడియో వేడుకకు అల్లు అర్జున్, అల్లు అరవింద్ అతిధులుగా హాజరయ్యారు. అల్లు అరవింద్ ఈ చిత్ర నిర్మాణంలో జరిగిన విశేషాల్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు.

     అర్జున్‌రెడ్డి సినిమా చూసి

    అర్జున్‌రెడ్డి సినిమా చూసి

    విజయ్ దేవరకొండ నటించిన అర్జున్‌రెడ్డి సినిమా చూసి చాలా డిస్ట్రబ్ అయ్యాను. నాకు నేను ప్రశ్నించుకొని ఎలాంటి సినిమాలు చేస్తున్నామనే ఫీలింగ్ కలిగింది. వారం రోజులపాట ఎవరినీ కలవలేదు. అర్జున్‌రెడ్డి విజయ్ నటనకు ఫిలింఫేర్ అవార్డు రావాలని అనుకున్నాను. నేను కోరుకున్నట్లే తనకు ఫిలింఫేర్ అవార్డు వచ్చినందుకు ఆనందించాను.

    విజయ్ అత్యుత్తమ నటన

    విజయ్ అత్యుత్తమ నటన

    అర్జున్ రెడ్డి చిత్రంలో తన కెరీర్‌లోనే కాదు ఇప్పుడున్నహీరోల్లోనే అత్యుత్తమ నటనను ప్రదర్శించాడు. టాలీవుడ్‌లో మంచి నటులున్నారు. అయితే అందులో గొప్ప నటులు కొందరే ఉన్నారు. ఆ కొందరిలో విజయ్ ఒకరు అన్నారు.

    రష్మిక మందన్న అద్భుతంగా

    రష్మిక మందన్న అద్భుతంగా

    నాలుగు రోజుల క్రితం గీతా గోవింద సినిమా చూశాను. విజయ్, రష్మిక మందన్న అద్భుతంగా నటించారు. పరుగు సినిమా నుంచి పరశురామ్‌ను చూస్తున్నాను. ఆ సినిమాకు తను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. శ్రీరస్తు శుభమస్తు సినిమా నుంచి అతన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నాను. ఆయనకు ఇది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. అందరికంటే ఎక్కువగా ఈ సినిమా పరశురామ్ కోసమే ఆడాలి అని అల్లు అర్జున్ అన్నాడు.

    రష్మికకే రాసిపెట్టి ఉంది..

    రష్మికకే రాసిపెట్టి ఉంది..

    గీతా గోవిందం చిత్రం రష్మికకే రాసిపెట్టి వుంది. ఇలాంటి పాత్ర దొరకడం ఆమె అదృష్టం. సినిమా చూసిన వారంతా ఆమె గురించే మాట్లాడతారు. గోపీ సుందర్ సంగీతం అంటే చాలా ఇష్టం. ఇంకేం ఇంకేం కావాలే... అనే పాట నాకెంతగానో నచ్చింది.

     శ్రీరస్తు శుభమస్తు టైంలోనే

    శ్రీరస్తు శుభమస్తు టైంలోనే

    పరశురామ్ ఈ చిత్ర కథని నాకు శ్రీరస్తు శుభమస్తు టైంలోనే చెప్పాడు. కథలో ముడి బావుంది. ఆరు నెలల తరువాత పూర్తి కథ చెప్పాడు. అప్పటి నుంచి పరశురామ్ ని ఆఫీస్ లోనే కట్టేసి ఉంచాం అని అల్లు అరవింద్ చమత్కరించారు అని అన్నారు.

    కొన్నిరోజులకే అర్జున్ రెడ్డి

    గీత గోవిందం చిత్రం ప్రారంభించిన కొన్ని రోజులకే అర్జున్ రెడ్డి చిత్రం విడుదలయింది. అర్జున్ రెడ్డి ఇమేజ్ వచ్చాక ఈ కథని విజయ్ తో చేయడం సరైనదేనా అని చిత్ర యూనిట్ చర్చించుకున్నాం. అయినా కూడా కథలో ఒక్క పదం కూడా మార్చకూడదని నిర్ణయించుకోవడమే ఈ సినిమా తొలి విజయం అని అన్నారు. ఈ పాత్రకు తగిన హీరో ఉండగా కథని మార్చడం ఎందుకు. కథలో ఎలాంటి మార్పులు లేకుండా షూటింగ్ కొనసాగించాం. అప్పుడే ఈ చిత్రం సక్సెస్ అనే ఫీలింగ్ కలిగిందని అరవింద్ పేర్కొన్నారు.

    ట్రోల్ చేసినా కూడా

    ట్రోల్ చేసినా కూడా

    ట్రోల్ చేసినా కూడా దానిని తనకు అనుకూలంగా మార్చుకునేంత తెలివైనోడు విజయ్ దేవరకొండ అని అరవింద్ అన్నారు. అదే ఇప్పటి ట్రెండ్, అతడి క్రేజ్ కు కారణం అని అన్నారు. రష్మిక ఈ చిత్రంలో అదరగొట్టేసిందని అల్లు అరవింద్ ప్రశంసించాడు. గీత గోవిందం అనే టైటిల్ నాకు మొదట నచ్చలేదు. కానీ ఇదే బావుందని పరశురామ్ చెప్పడంతో అయిష్టంగానే ఒప్పుకున్నా. కానీ ఈ టైటిలే జనాల్లోకి బాగా వెళ్లిందని అన్నారు.

    English summary
    Allu Aravind Dynamic Speech at Geetha Govindam Audio Launch. Vijay Deverakonda and Rashmika Mandanna are lead roles in this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X