సరికొత్త వ్యాపారంలోకి అల్లు అరవింద్.. తెలుగులో మొట్టమొదటి ఓటిటి సేవలు.. ఆ ఇద్దరు బిజినెస్‌మెన్లతో?
Recommended Video
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగులో మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తెలుగులో తొలి ఓటిటి సర్వీస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.
ఓటిటి సర్వీస్ అంటే... 'ఓవర్-ది-టాప్'. కేబుల్ కనెక్షన్, డీటీహెచ్ సర్వీస్ లేకుండా కామ్‌కాస్ట్ తరహాలో ఇంటర్నెట్ ద్వారా టీవీ, ఫిల్మ్ కంటెంట్ అందించడం. తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి సర్వీస్ లేదు. తొలిసారి అల్లు అరవింద్ మరికొందరితో కలిసి ఈ సర్వీస్ లాంచ్ చేయబోతున్నారట.

నిమ్మగడ్డ ప్రసాద్, మైహోమ్ గ్రూఫ్ రామేశ్వర్ రావులతో కలిసి..
ప్రముఖ పారిశ్రామిక వేత్తలైన నిమ్మగడ్డ ప్రసాద్, జూపల్లి రామేశ్వరరావులతో కలిసి అల్లు అరవింద్ ఈ ఓటిటి సర్వీస్ లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచే ఈ సర్వీస్ ఆపరేషన్స్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట.

రామేశ్వర్ రావు రూ. 70 కోట్ల పెట్టుబడి?
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... మైహోమ్ రామేశ్వర్ రావు ఈ వెంచర్లో రూ. 70 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అరవింద్ బేనర్ ద్వారా వచ్చే ఒరిజినల్ కంటెంట్ ఇందులో భాగంగా ఉంటుందని టాక్.

ముగ్గురూ కలిసి
మాటీవీ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ చేస్తున్నపెద్ద వెంచర్ ఇదే. అల్లు అరవింద్, మైహోమ్ రామేశ్వరరావులతో కలిసి తెలుగులో తొలి ఓటిటి సర్వీస్ లాంచ్ చేయబోతున్నారు. జూబ్లీహిల్స్‌లో ఇందుకు సంబంధించిన కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

భవిష్యత్ అంతా ఓటిటి హవా
ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగం. ఓటిటి సర్వీస్‌కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. భవిష్యత్తులో దీనికి మంచి డిమాండ్ ఉండటం, ఆదాయం కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉండటంతో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











