twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మగధీర’ను కాపీ కొట్టారంటూ.... కేసు పెట్టిన అల్లు అరవింద్!

    హిందీతో తెరకెక్కుతున్న ‘రబ్తా’ సినిమాపై ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ కేసు వేసారు. ఈ సినిమా తాను నిర్మించిన ‘మగధీర’ చిత్రాన్ని కాపీ కొట్టి తీసారని,

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హిందీతో తెరకెక్కుతున్న 'రబ్తా' సినిమాపై ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ కేసు వేసారు. ఈ సినిమా తాను నిర్మించిన 'మగధీర' చిత్రాన్ని కాపీ కొట్టి తీసారని, వెంటనే సినిమా విడుదల నిలిపివేయాలని అల్లు అరవింద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.

    అల్లు అరవింద్ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. కాగా జూన్ 9 'రబ్తా' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

    కాపీ కొట్టినట్లే ఉంది

    సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, కృతి సనన్‌ జంటగా తెరకెక్కుతున్న హిందీ ఫిల్మ్ 'రబ్తా' ట్రైలర్ ఇటీవల రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే మగధీర సినిమాకు కాపీలా ఉందని అంటున్నారు.

    రబ్తా

    రబ్తా

    రబ్తా చిత్రానికి దినేష్ విజన్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ చిత్ర దర్శకుడు ‘కాక్ టెయిల్' లాంటి హిట్ చిత్రాన్ని అందించారు. బద్లాపూర్, హ్యాపీ ఎండింగ్, ఫైండింగ్ ఫన్నీ, గో గోవా గాన్, ఏజెంట్ వినోద్, లవ్ ఆజ్ కల్, హైజాక్, బీయింగ్ సైరస్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

    హాట్ సీన్లు

    హాట్ సీన్లు

    ఇక సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్ మధ్య రొమాంటిక్ సీన్లు, ముద్దు సన్నివేశాలు జోరుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంత హాటుగా, ఘాటుగా క్రితి సనన్ గతంలో ఎప్పుడూ, ఏ హీరోతోనూ రొమాన్స్ చేయలేదు.

    అల్లు అరవింద్ కేసు

    అల్లు అరవింద్ కేసు

    ఈ సినిమా మగధీర చిత్రానికి కాపీలా ఉందని కొంతకాలంగా మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుండటంతో.... అల్లు అరవింద్ కూడా ఈ సినిమా మా సినిమాలా ఉందనే అనుమానంతో కోర్టుకెక్కారు. రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2009లో వచ్చిన మగధీర అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

    English summary
    Allu Aravind file case against Raabta. There was a huge hue and cry on the social media that the film was a clear cut copy of Rajamouli’s Magadheera. Now, as the film is ready for release, the makers of Magadheera, Geetha Arts have filed a court seeking an injunction against the film’s release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X