బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రజారాజ్యం ఆవిర్భావం గురించి ఉందని, తమ పార్టీ అదికారాన్ని చేపట్టి ప్రజల మన్ననలు పొందేలా పరిపాలన సాగిస్తుందని పేర్కొన్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ తెలిపారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి పూలదండ వేసి పై విధంగా చెప్పారు అరవింద్. ఆ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పింది ఇప్పటివరకూ ఏదీ జరగకుండా ఉండలేదని, అలాగే ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రావటం ముమ్మాటికి ఖాయంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. అలాగే మైనార్టీలను ఆనాడే బ్రహ్మంగారు చేరదీసి సర్వమత సమానత్వాన్ని ప్రభోదించారన్నారు.