Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాంగోపాల్ వర్మ ద్రోహి.. నికృష్ణుడు.. అల్లు అరవింద్ ఫైర్
Recommended Video
ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు అయింది. నా తండ్రి అల్లు రామలింగయ్య, చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇలా మేమంతా ఎన్నో ఎళ్లుగా పరిశ్రమతో అనుబంధం ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు తల్లిలాంటింది. అలాంటి పరిశ్రమలో చోటుచేసుకొన్న విషయాలు చాలా బాధకలిగించాయి అని అల్లు అరవింద్ అన్నారు.
ఇటీవల సంఘటనలతో బాధగా
ఇటీవల జరుగుతున్న సంఘటనలు చాలా బాధకు గురిచేసింది. శ్రీరెడ్డి బయటపెట్టిన విషయాలపై పరిశ్రమ స్పందించింది. ఆమె లేవనెత్తిన విషయాలకు సినీ వర్గాలు పరిష్కారాలను సూచిస్తాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబతున్నారనే విషయాలను వెల్లడిస్తారు.
నా పాత్ర గురించి క్లారిటీ
సినీ పరిశ్రమలో నా పాత్ర గురించి నేను ప్రస్తుతం క్లారిటీ ఇచ్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. సినీ పరిశ్రమలో వేధింపులకు చెక్ పెట్టడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో ఎన్జీవో నుంచి సభ్యులకు చోటు కల్పిస్తారు.
కఠిన చర్యలు తీసుకొంటాం
సినిమా పరిశ్రమలో ఎవరైనా నిర్మాత సినీతారలపై వేధింపులకు పాల్పడితే అతడి నుంచి తొలగిస్తాం. దర్శకులు, అసిస్టెంట్లు ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకొంటాం.
రాంగోపాల్ వర్మ ద్రోహి.. నికృష్ణుడని
రాంగోపాల్ వర్మను నేను టార్గెట్ చేస్తున్నాను. ఇండస్ట్రీలో శివ లాంటి గొప్ప సినిమాను తీశాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ముంబైలో ఉంటున్నాడు. అతడు తల్లిగా భావించాల్సిన ఆ వ్యక్తి ఎలాంటి ద్రోహం చేస్తున్నాడో చెప్పడానికి మీముందుకు వచ్చాను. అలాంటి వ్యక్తి ఎంత నికృష్ణుడో చెప్పడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను.
గౌరవం ఇవ్వదలచుకోలేదు
రాంగోపాల్ వర్మ గారు అనే గౌరవం ఇవ్వదలచుకోలేదు. అందుకే నిన్ను మిస్టర్ రాంగోపాల్ వర్మ అని అంటాను. పవన్‌పై నీచమైన పదజాలాన్ని ఉపయోగించి శ్రీరెడ్డికి చెప్పాననే వీడియోను రాత్రి చూశాను. అయితే అప్పుడు కూడా వర్మ అలాంటి వాడు కాదని అనుకొన్నాను. మరో వీడియో చేస్తే గానీ రాంగోపాల్ వర్మ వెధవ తెలివితేటలు తెలిసిరాలేదు.
వర్మ బూటకం.. దొంగ నాటకం
పవన్ కల్యాణ్‌ను దూషించమని శ్రీరెడ్డికి చెప్పినట్టు వర్మ ఓ వీడియో చెప్పాడు. శ్రీరెడ్డి రిలీజ్ చేసిన వీడియో వచ్చేస్తుందని తెలుసుకొన్న వర్మ.. తాను ఇరుకున పడటం ఖాయమని ముందే ఓ వీడియోను రిలీజ్ చేశాడు. తన పరువును కాపాడుకోవడానికి ఓ బూటకం, ఓ నాటకం ఆడారు. తనను తాను కాపాడుకోవడానికి చచ్చు తెలివితేటలు చూపి ఓ వీడియోను పెట్టారు. వర్మతో ఉంటే ఓ నీచపు బ్యాచ్ కలిసి ఇదంతా చేశారు.
పవన్‌పై బురద జల్లడానికి
అదే వీడియోలో సురేష్ ఫ్యామిలీ నుంచి శ్రీరెడ్డికి ఐదు కోట్లు ఇప్పిస్తానని వర్మ చెప్పాడు. కానీ వారు వర్మ ఉచ్చులో పడలేదు. పవన్ కల్యాణ్‌ను దెబ్బ తీయడానికి ఐదు కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి. కుట్రలో భాగంగానే పవన్ కల్యాణ్‌పై బురద జల్లుడానికి ప్రయత్నిస్తున్నాడు.