twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ బంధం ఎప్పుడో పోయింది, చిరంజీవి వల్లే నేడు వీళ్లకి కష్టాలు: అల్లు అరవింద్

    By Bojja Kumar
    |

    తెలుగు సినిమా పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవి ఈ స్థాయికి వచ్చారంటే ఆయన టాలెంటుతో పాటు... తనకు ప్రతి విషయంలోనూ చేదోడువాదోడుగా ఉన్న బావ మరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఓ కారణం. తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన అల్లు అరవింద్ చిరంజీవి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

    చిరంజీవి నన్ను నమ్మారు కాబట్టే

    చిరంజీవి నన్ను నమ్మారు కాబట్టే

    చిరంజీవిగారు ఎంతో కష్టపడ్డారు కాబట్టే ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. చిరంజీవిగారు నన్ను నమ్మడం నేను బాధ్యతగా ఫీలయ్యాను. ఆయన వెనకాల ఉండి చిన్న చిన్న బాధ్యతలను నేను తీసుకున్నాను. దాని వల్ల ఆయన ఎలాంటి ఆలోచనలు లేకుండా ఫ్రీగా సినిమాలు చేయగలిగారు. అంతకు మించి మరేమీ లేదని అల్లు అరవింద్ తెలిపారు.

    బావ బావమరిది బంధం ఎప్పుడో పోయింది

    బావ బావమరిది బంధం ఎప్పుడో పోయింది

    చిరంజీవిగారితో నా అసోసియేషన్‌ దాదాపు నలభై ఏళ్లు. చిరంజీవిగారు, నేను మంచి ఫ్రెండ్స్‌. బావా బావమరిది అనేది నా సిస్టర్‌తో ఆయనకు పెళ్లైన ఫస్ట్‌ త్రీ ఇయర్స్‌లోనే పోయింది. ఇప్పుడు మా మధ్యలో బంధుత్వం కంటే స్నేహమే ఎక్కువ ఉంది. ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్‌ లెవల్స్‌ చాలా ఎక్కువ ఉండటం వల్ల ఇన్నేళ్లు కలిసి ట్రావెల్ చేయగలిగామని అల్లు అరవింద్ తెలిపారు.

    Recommended Video

    ఆ ప్రయత్నాల్లో బిజీగా ఉన్న మెగా హీరోస్ !
    రాళ్లు పడ్డా పర్లేదనే బాధ్య తీసుకున్నా

    రాళ్లు పడ్డా పర్లేదనే బాధ్య తీసుకున్నా

    చిరంజీవి ముందుంటారు, అరవింద్ వెనక ఉండి నడిపిస్తారని అంతా అనుకుంటారు. మంచి జరిగితే ఒకే..తేడా వస్తే అరవింద్ సూత్రధారి అంటారు. ఇలా రాళ్లే వసే వారిపై మీ అభిప్రాయం ఏమిటి? అనే ప్రశ్నకు అరవింద్ స్పందిస్తూ..... ఏ కుటుంబంలో అయినా ఒకరు బాధ్యత తీసుకోవాలి, మా కుటుంబంలో నేను తీసుకున్నాను. అందరి బాగోగులు చూడటం నా రెస్పాన్సిబిలిటీ. అలా చేసినప్పుడు బయట నుంచి రాళ్లు పడతాయి. అది సహజం. ఆ విషయంలో నాకేం ప్రాబ్లమ్‌ లేదు.... అని అరవింద్ అన్నారు.

    చిరంజీవితో టఫ్ సిచ్యువేషన్స్

    చిరంజీవితో టఫ్ సిచ్యువేషన్స్

    చిరంజీవితో టఫ్ సిచ్యువేషన్స్ అంటే వ్యక్తిగతంగా ఏమీ రాలేదు. పాలిటిక్స్‌లోకి వెళ్లినపుడు కొన్ని చిన్ని చిన్నవి ఎదురయ్యాయి. అవి మమ్మల్ని ఏమీ చేయలేక పోయాయి. మా మధ్య ఎలాంటి దూరాన్ని పెంచలేక పోయాయి అని అరవింద్ అన్నారు.

    చిరంజీవి వల్లే ఈరోజు వీళ్లకి ఇన్ని కష్టాలు

    చిరంజీవి వల్లే ఈరోజు వీళ్లకి ఇన్ని కష్టాలు

    చిరంజీవిగారు హార్డ్‌ వర్కింగ్‌లో హయ్యస్ట్‌ మార్క్‌ సెట్‌ చేశారు. ఆ లెవల్‌కి మా ఫ్యామిలీలోని హీరోలు చరణ్, బన్నీ, వరుణ్ వీళ్లెవ్వరూ చేరలేకపోయారు. ఇంతవరకూ ఎవ్వరూ కొట్టలేదు. ఆ మార్క్‌ను చేరుకోవడం వీళ్లందరికీ కష్టమవుతోంది. వాస్తవానికి చెప్పాలంటే చిరంజీవిగారు వీళ్లందరికీ కష్టాలు తెచ్చిపెట్టాడు. అదే ఆయన అపుడు యావరేజ్‌గా వర్క్‌ చేసి ఉంటే వీళ్లకు ఇన్ని కష్టాలుండేవి కావేమో... అంటూ అల్లు అరవింద్ చమత్కరించారు.

    English summary
    Allu Aravind interesting comments about Chiranjeevi. Allu Arvind said " Chiranjeevi is a good friend of mine".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X