తెలుగు పరిశ్రమ నేరుచుకున్న పాఠం ఇదే.. టికెట్ రేట్లు, ఓటీటీల గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ అలరిస్తున్న గోపిచంద్ 'సీటిమార్'తో హిట్ అందుకున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'పక్కా కమర్షియల్'. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో 'పక్కా కమర్షియల్' బృందం సినిమా ప్రమోషన్లను ప్రారంభించింది.
తాజాగా 'పక్కా కమర్షియల్' బృందం ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని దస్పల్లా కన్వెన్షన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఇక ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీ ఇప్పుడు నేర్చుకున్న పాఠం ఒకటి ఉందని అదేమిటి అంటే టికెట్ రేట్లు తగ్గించాలి, ఓటిటిలలో ఆలస్యంగా వేయాలని అన్నారు.
సినిమాలు థియేటర్లోనే చూడాలన్న ఆయన, ఈ మధ్య ఆడియన్స్ థియేటర్స్ కు రావడం లేదని అన్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం హీరో కూడా రావాలని, ఈ మధ్య స్టేజ్ మీద ఓ పెద్ద హిరో డాన్స్ కూడా చేశాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఆడియన్స్ థియేటర్స్ కి రప్పించడానికి హీరో హీరోయిన్స్ ప్రమోషన్ చేసుకోవాలని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

ఇక హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. 'డైరెక్టర్ మారుతి నాకు స్టోరీ ఫస్టాఫ్ చెప్పి.. సెకెండ్ హాఫ్‌కు గ్యాప్ ఇద్దామని అనుకున్నాడు. కానీ నేను వెంటనే సెకండ్ హాఫ్ కూడా చెప్పమని అడిగా, కథ వినగానే మారుతికి ఓకే చెప్పాను. మారుతి అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే వంశీ నా దగ్గరకు వచ్చాడని అన్నారు.
నేను మొహమాటానికి ఈ సినిమా ఒప్పుకోలేదని, కథ చాలా బాగా నచ్చడంతో ఒప్పుకున్నానని అన్నారు. మారుతి మీద మొత్తం నమ్మకం పెట్టి ఈ మూవీ చేశా. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నాడని ఆయన అన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. టైటిల్ తగినట్లు ఇది పక్కా కమర్షియల్ మూవీ..' అని గోపీచంద్ అన్నారు.
ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన 'అందాల రాశి' పాటకు నుంచి విశేష స్పందన వచ్చింది. రాశీఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌లపై బన్నివాసు, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించారు. జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, హీరోయిన్ రాశీఖన్నా తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











