twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌ను మించి సూపర్ బాస్.. చిరుతో అల్లు అరవింద్ సెన్సేషనల్ ప్లానింగ్

    |

    కరోనా లాక్‌డౌన్ పుణ్యమా అని దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఓటీటీల హవా పెరగడంతో భారీ పోటికి తెర లేసింది. సినిమా థియేటర్లను పక్కన పెట్టి టెలివిజన్‌కు, ఓటీటీలకు మధ్య భారీ పోటీ వాతావరణం నెలకొనే పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్‌లో జరిగే మార్పులను ఊహించి ముందే ఓటీటీలోకి ప్రవేశించి ఆహా యాప్‌తో రంగంలోకి దూకిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇప్పుడు భారీ ప్లానింగ్‌కు సిద్ధమయ్యారు. ఆయన గురువారం ఆహా ఆగస్టు బ్లాక్ బస్టర్‌ సెలబ్రేషన్ సందర్భంగా మీడియాతో జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ..

    40 లక్షల ఆహా యాప్‌ డౌన్‌లోడ్స్

    40 లక్షల ఆహా యాప్‌ డౌన్‌లోడ్స్

    ఆహా యాప్‌కు ఊహించని రీతిలో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తున్నది. ఇప్పటికే 40 లక్షల మంది ఖాతాదారులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొన్నారు. రానున్న ఏడాది కాలంలో ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ఎన్ని ఓటీటీలు వచ్చినా సినిమా థియేటర్‌ను మించిన అనుభూతి మరోటి ఉండదని స్పష్టం చేశారు. ఆహా యాప్‌ కోసం భారీ సంఖ్యలో టీమ్‌ను సెట్ చేసుకొన్నాం అని అల్లు అరవింద్ చెప్పారు.

    అగ్ర దర్శకులతో భారీ షోలు

    అగ్ర దర్శకులతో భారీ షోలు

    ఆహా యాప్‌పై అద్భుతమైన షోలకు ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే యాంకర్ సుమతో ఆల్ ఈజ్ వెల్ షో సిద్ధమైంది. టాలీవుడ్‌లో నలుగురు అగ్ర దర్శకులతో భారీ షోలను ప్రారంభించబోతున్నాం. ప్లానింగ్ అంతా సిద్దమైంది. కరోనా లాక్‌డౌన్ పరిస్థితులు ముగిసిన తర్వాత సెట్స్‌పైకి వెళ్తున్నాం. వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం అని అల్లు అరవింద్ వెల్లడించారు.

    భారీ సంఖ్యలో షోలు, సినిమాలు

    భారీ సంఖ్యలో షోలు, సినిమాలు

    ఇక ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై భారీగా షోలు, సినిమాలను రూపొందించే పనిలో ఉన్నాం. ఇప్పటికే దాదాపు 42 కార్యక్రమాలకు సంబంధించిన ప్లానింగ్ పూర్తయింది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత షూటింగ్‌లు మొదలు పెడుతాం. కంటెంట్ సెలక్షన్ కోసం పూర్తిస్థాయిలో ఓ టీమ్ పనిచేస్తున్నది. కథల సెలక్షన్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొంటున్నాం. మా టీమ్ ఎంపిక చేసిన కథలను ఫైనల్‌గా వింటున్నాను అని అల్లు అరవింద్ చెప్పారు.

    ఓటీటీతోపాటు ఏటీటీపై దృష్టిపెట్టాం

    ఓటీటీతోపాటు ఏటీటీపై దృష్టిపెట్టాం

    సినిమా పరిశ్రమలో ఓటీటీ సరికొత్త సంచలనం. శాటిలైట్‌కు భిన్నంగా వెబ్ మీడియా బలపడుతున్నది. వచ్చే రెండేళ్లలో స్టార్ హీరోలు కూడా ఓటీటీలోకి రావడం ఖాయం. పెద్ద పెద్ద హీరోలందరూ ఓటీటీ గురించి ఆలోచిస్తున్నారు. ఎనీటైమ్ సినిమా (ఏటీటీ)కి మంచి భవిష్యత్ ఉంది. అల్లు అర్జున్, శిరీష్‌ కూడా ఓటీటీలోకి ప్రవేశించే ఆలోచనలో ఉన్నారు అని అల్లు అరవింద్ చెప్పారు.

    చిరంజీవితో సూపర్‌ బాస్ షో

    చిరంజీవితో సూపర్‌ బాస్ షో

    ఓటీటీలోకి బాస్ చిరంజీవిని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాడు. బాస్ అంటే ఆయన బిగ్‌బాస్ కాదు.. బిగ్‌బాస్‌ను మించిన సూపర్‌బాస్. త్వరలోనే సూపర్‌బాస్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవితో సంప్రదింపులు జరుపుతున్నాం అని అల్లు అరవింద్ తెలిపారు.

    English summary
    Tollywood ace producer Allu Aravind is planning Super Boss with Megastar Chiranjeevi. He said we are planning to compete Bigg Boss on Aha app. We have plans to produce the 42 shows on Aha app.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X