పాత రూల్స్ పనికిరావు: అల్లు అరవింద్

అమీర్ ఖాన్ నటించిన గజనీ సినిమా జాతీయ స్థాయిలో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న చిత్రంగా నిలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ ఘనత (రూ.250 కోట్లు వసూలు చేయడం) ఒక్క గీతా ఆర్ట్స్ కి చెందినది మాత్రమే అనుకోను... తెలుగువాళ్లందరిదీ అంటాను. ఇంతకుముందుతో పోలిస్తే హిందీ చిత్రపరిశ్రమ చాలా మారింది. అక్కడివారి ప్రోడక్షన్ వ్యాల్యూస్ బాగా పెరిగాయి. టెక్నికల్ గా చాలా అడ్వాన్స్ డ్ స్టేజీలో ఉన్నారు. ఇక గజనీ విజయం వెనక చక్కటి కార్పొరేట్ పద్దతులు ఉన్నాయి.
ఇలాంటి వాతావరణం తెలుగులోనూ రావాలి. ఇక్కడ కూడా కార్పొరేట్ సంస్కృతిని ప్రవేశపెట్టేందుకు పరిశ్రమ పరంగా కొన్ని నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయి. వాటిని కొంత సరళీకరించాలి. ఇక గీతా ఆర్ట్స్ ద్వారా వరుసగా చిత్రాలు నిర్మిస్తాం. భారీ సినిమాలకే కాదు చిన్నవాటికీ ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఇంతకీ గజనీ చిత్రాన్ని డైరక్ట్ చేసిన మురగదాస్..తమిళ పరిశ్రమకు చెందిన వ్యక్తి.


Click it and Unblock the Notifications