మరో మెగా హీరో వరుణ్ తేజ్ ఎంట్రీ ఖరారు
మెగా స్టార్ చిరంజీవి కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ రాబోతున్నాడు. చిరంజీవి సోదరుడు, నిర్మాత నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఎంట్రీ దాదాపుగా ఖరారైంది. మెగాస్టార్ బావ మరిది అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై వరుణ్ తేజను హీరోగా పరియం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మంచి స్క్రిప్టు కోసం వేట సాగుతోంది.
వాస్తవానికి 2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా...మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్ గా ఎదిగిన నేపథ్యంలో తన తనయుడికి కూడా సెంటిమెంటు పని చేస్తుందని నాగాబాబు ఆశ పడుతున్నాడని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
మరో వైపు అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీ్ష్ కూడా..తన సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ ద్వారా తొలుత తమిళంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. 15 సినిమాలు తమిళంలో చేసిన తర్వాతనే తెలుగులో అడుగు పెడతానంటున్నాడు అల్లువారి చిన్నబ్బాయ్.


Click it and Unblock the Notifications











