ప్రపంచమంతా ఎ.ఆర్.రహమాన్ కు ఆస్కార్ కి రావడంపై మాట్లాడుకుంటూంటే...అల్లు అరవింద్...మరో వ్యక్తికి ఆస్కార్ వస్తుందంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నుంచి ఆస్కార్ గెలుచుకోతగ్గ మరో వ్యక్తి గురించి చెపుతాను. అతనెవరో కాదు..కె.రాఘవేంద్రరావుగారి అబ్బాయి కోవెలమూడి సూర్య ప్రకాష్ కూడా ఆ సత్తా ఉంది. ఏదో ఒక రోజు అతను ఆస్కార్ గెల్చుకుంటాడు అని అన్నారు. ఇక రహమాన్..కి అవార్డు రావటం..పై స్పందిస్తూ..ఎంటర్టైన్ మెంట్ రంగానికే ఇది గర్వ కారణం. అది కూడా నేను హిందీలో ఇటీవల రూపొందించిన గజనీ చిత్రానికి పని చేసిన రహ్మాన్, రసూల్ పూకుట్టిలు అవార్డు గెలుచుకోవటం నాకే వచ్చినంత ఆనందంగా ఉంది అన్నారు.