twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి క్షేమం, రేపటికల్లా కోలుకోవచ్చు : అల్లు అరవింద్

    తాజాగా నిర్మాత అల్లు అరవింద్ చేసిన ప్రకటనని బట్టి దాసరి ఆరోగ్యం నిలకడ గానే ఉందని తెలుస్తోంది.

    |

    మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆరోగ్య సమస్యలతో భాదపడుతూ ఆయన మూడు రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. గతకొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యలతో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు .ఆయనకు మెరుగైన చికిత్సని అందించడం కోసం వైద్యులు ఐసీయూకి తరలించినట్లు తెలుస్తోంది.

    ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధింత సమస్యలతో భాదపడుతున్న ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం దాసరి ఆరోగ్యం నిలకడ గా ఉన్నట్లు సమాచారం అందుతోంది. గత కొంత కాలంగా దాసరి అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా యాక్టివ్ గా లేరు. పొద్దున్నుంచీ పలువురు సినీ ప్రముఖులు కింస్ చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఆరాలు తీసారు.

    Allu Aravind On Dasari Health issue

    ఊపిరితిత్తులు,కిడ్నీ సమస్యలతో ఆయన్ను నిన్న రాత్రి కిమ్స్ లో చేర్చారు.గడిచిన మూడేళ్ళుగా అనారోగ్య సమస్యలతో దాసరి ఇబ్బంది పడుతున్నారు.కొన్నాళ్లుగా పరిస్థితి మెరుగుపడిందని అంతా భావించారు.ఇటీవల ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఆయన పాల్గొనడంతో దాసరి ఆరోగ్యం మెరుగుపడిందని అనుకున్నారు.

    జయలలిత జీవిత కథ ఆధారంగా కొత్త సినిమా తీస్తానని ఆయన ప్రకటించడం,కాపు ఉద్యమానికి అండగా సమావేశాలు జరపడంతో దాసరి ఈజ్ బ్యాక్ అని అభిమానులు కూడా సంతోషపడ్డారు.ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరు తో ఆయన సంబంధాలు మెరుగుపడ్డట్టేనని భావిస్తున్న సమయంలో ఈ అనారోగ్య విషయం బయటికి వచ్చింది.

    అయితే తాజాగా నిర్మాత అల్లు అరవింద్ చేసిన ప్రకటనని బట్టి దాసరి ఆరోగ్యం నిలకడ గానే ఉందని తెలుస్తోంది. దాసరి ఆరోగ్యం మెరుగ్గనే ఉందని. దాదాపు రేపటికల్లా ఆయన పూర్థి స్తాయిలో కోలుకుంటారనీ అల్లు చెప్పటం తో టాలీవుడ్ లో కాస్త ప్రశాంతత నెలకొంది.

    English summary
    Veteran film director and former Union Minister Dasari Narayana Rao hospitalised. He has been admitted to ICU at KIMS hospital
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X