'మగధీర' పై అల్లు అరవింద్

By Staff

Ram Charan Teja
తమ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రామ్ చరణ్ తేజ, కాజల్ కాంబినేషన్లో ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన మగధీర చిత్రం గురించి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. "చరణ్‌ని హీరోగా మరో మెట్టు పైకి తీసుకెళ్లి, అభిమానులకు కనువిందు చేసేలా ఉంటుంది 'మగధీర'. ఈ టైటిల్‌కి చరణ్‌ అతికినట్లు సరిపోతాడు. భారీ వ్యయంతో నిర్మించాం. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుడుతుంది. ఈ వేసవిలో చక్కటి వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాము" అన్నారు.

ఈ చిత్రలో చరణ్ స్టంట్ మేన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పునర్జన్మల చుట్టూ తిరిగే ఈ కథ ప్రకారం చరణ్ ఈ కాలంలో ఫైట్స్ చేస్తూ బ్రతికుతూంటాడు. అక్కడ ఫ్యాషన్ డిజైనర్ గా వచ్చిన కాజల్ పరిచయమవుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే గతంలో దాదాపు 400 సంవత్సరాల క్రిందటే వీరి ప్రేమ మొలకెత్తుతుంది. అప్పుడు శ్రీహరి పాత్ర వల్ల వీరు విడిపోతారు. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరు మధ్య మరో రకమైన శక్తులు అడ్డుపడతాయి. ఈ జన్మలో శ్రీహరి వీరిని కలపటానకి ప్రయత్నిస్తాడు.

అలాగే మగధీర చిత్రం షూటింగ్ వర్కింగ్ డేస్ 220 రోజులని సమాచారం. బడ్జెట్ కూడా దాదాపు ముఫ్ఫై ఎనిమిది కోట్లు దాకా అయిందని అంతటా వినిపిస్తోంది. అయితే సంవత్సరాలు తరబడి షూటింగ్ జరుపుకున్న చిత్రాలు ఉన్నాయి గానీ..పక్కా ప్లానింగ్ తో వెళ్ళే రాజమౌళి ఇన్ని రోజులు షూటింగ్ చేయటం అనేది ఆశ్చర్యమేనంటున్నారు. ఈ చిత్రం మూడు భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ అనంతరం రిలీజ్ అయ్యే ఈ సినిమా రీరికార్డింగ్ నిమిత్తం ప్రస్తుతం ఫిలిం సిటీలో ఉంది. ఇప్పటికే యూ ట్యూబ్ ద్వారా కొన్ని లీక్ అయిన విజువల్స్ అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. టైటిల్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే 220 రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అన్ని రోజులూ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరో ముఖ్య విశేషం ఏమిటంటే 'బంగారు కోడిపెట్ట...' రీమిక్స్‌ గీతంలో చిరంజీవి, చరణ్‌ కలిసి నృత్యం చేశారు. త్వరలో పాటల్నీ, మే ద్వితీయార్థంలో చిత్రాన్నీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'మగధీర'లో శ్రీహరి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కథ: వి.విజయేంద్రప్రసాద్‌, స్త్టెలింగ్‌: రమా రాజమౌళి, సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X