చిరంజీవి, వరుణ్ తేజ్, అల్లు అర్జున్.. మూడు భారీ చిత్రాలు, అల్లు అరవింద్ మెగాప్లాన్!
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లానింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా నిర్మాణం విషయంలో ఆయన పక్కాగా వ్యవహరిస్తారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందే చిత్రాలకు విజయాల శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అల్లు అరవింద్ భారీ చిత్రాల్ని నిర్మించలేదు. తాజాగా అరవింద్ భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి. అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లతో ఆయన భారీ చిత్రాలకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

బన్నితో
అల్లు అర్జున్ తదుపరి చిత్రం సొంత బ్యానర్ లోనే అల్లు అరవింద్ నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆలస్యం జరిగినా మంచి కథకోసం బన్నీ వెయిట్ చేస్తున్నాడు. నా పేరు సూర్య చిత్రం తరువాత ఇంత వరకు బన్నీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు.

మెగాస్టార్ చిరంజీవి
గతంలో మెగాస్టార్ చిరంజీవితో అల్లు అరవింద్ చాలా చిత్రాలు నిర్మించారు. మెగాస్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తరువాత వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. మెగాస్టార్ తో చిత్రం అంటే ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

కొరటాల తరువాత
ప్రస్తుతం మెగాస్టార్ సైరా చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తరువాత కొరటాల దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల చిత్రానికి నిర్మాతలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారట. దీనితో ఈ చిత్రం తరువాత అల్లు అరవింద్ నిర్మించే చిత్రం ప్రారంభం అవుతుందని అంటున్నారు.

వరుణ్ తేజ్‌తో కూడా
ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా దర్శక నిర్మాతలకు క్రేజీ హీరోగా మారిపోతున్నాడు. వరుణ్ తేజ్ తో కూడా ఓ చిత్రానికి అరవింద్ సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











