వర్మ నీ తల్లిని.. అక్కను తిట్టిస్తే? తల్లిపాలు తాగి ఇలా చేస్తావా నీచుడా? క్రిమినల్.. అల్లు అరవింద్
Recommended Video

నటి శ్రీరెడ్డి పక్కదోవ పట్టించి వర్మ నీచమైన కుట్రలకు పాల్పడ్డారని నిర్మాత అల్లు అరవింద్ ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ ప్రతిష్ఠను దిగజార్చడానికి నీవు చీప్ ట్రిక్స్ పాల్పడుతావా? అంటూ ఆర్జీవీని ఎండగట్టారు. శ్రీరెడ్డితో పవన్ కుటుంబంపై చేయించిన దూషణలను ఉద్దేశించి హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో అల్లు అరవింద్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అల్లు అరవింద్ వెల్లడించిన విషయాలు ఇవే..

నీ అక్కను.. తల్లిని తిట్టిస్తే
పవన్ కల్యాణ్‌ను తిట్టినట్టుగానే నీ తల్లిని, నీ అక్కనో.. నీ భార్యను, లేదా నీ కూతురును అలాగే తిట్టిపిస్తే నీ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా అని అల్లు అరవింద్ నిలదీశాడు. అలాంటి నీచత్వం మాకు లేదు. మేము చేయం. నీవు ఇలాంటి నీచమైన మనస్తత్వం కలవాడివి అని అందరికీ తెలుసు.

ఇంటెలిజెంట్ క్రూక్ నీవు..
నీవో ఇంటలిజెంట్. నీవు ఇంటెలిజెంట్ క్రూక్. నీవు ఇంటలిజెంట్ క్రూక్ కనుక.. శ్రీరెడ్డి నీ బండారం బయటపెట్టకముందే నీవు మరో వీడియోను బయటపెట్టి వెధవ తెలివితేటలు బయటపెట్టుకొన్నావు. నీ చేష్టలను ప్రజల దృష్టికి తీసుకెళ్తాం.

మెగా ఫ్యామిలీపై అక్కసు ఎందుకు
నిర్మాత సురేష్ కుటుంబంపై ఉన్న ప్రేమ మెగా ఫ్యామిలీపై ఎందుకు లేదు. సినిమా పరిశ్రమను కాపాడుకోవాలనుకొన్నవాడివి ఇలాంటి చేష్టలు ఎందుకు? నాగార్జున సహాయంతో శివ తీసి మంచి పేరు సంపాదించుకొన్నావు. నిన్ను పెంచిన ఇండస్ట్రీకి ఎందుకు కీడు తలపెడుతున్నావ్.

తల్లి పాలు తాగి రొమ్ము కొరికే
తల్లి లాంటి ఇండస్ట్రీ పాలు తాగి రొమ్ము గుద్దుతున్నావు. అది నీకు సమంజసమా? ఇండస్ట్రీ పరువు ఎందుకు తీయాలనుకొంటున్నావు? ఇండస్ట్రీని పరువు తీసే విషయంలో నీ పాత్ర ఉందనే విషయం తేటతెల్లమైంది. ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఉండాలా? ఇలాంటి వ్యక్తిపై సినీ పరిశ్రమ ఎలాంటి చర్యలు తీసుకొంటారో సినీ పరిశ్రమ వర్గాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.

పరిశ్రమ సిగ్గుపడుతున్నది..
వర్మ నీ ప్రవర్తన వల్ల సినీ పరిశ్రమ సిగ్గుపడుతున్నది. ఇలాంటి నీచులను ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. శ్రీరెడ్డి ఏదో ఎమోషన్‌లో అలా అన్నదని నాగబాబు అనుకొన్నారు. ఓ నేరం చేయడానికి కత్తి పుచ్చుకొన్నది ఒకరు. ఆ నేరానికి ప్లాన్ చేసిన వ్యక్తి మరోకరు. నేరం విషయంలో ప్లాన్ చేసిన వ్యక్తికే శిక్ష పడుతుంది. కాబట్టి ఈ కుట్రలో రాంగోపాల్ వర్మలో వర్మ శిక్షపడాల్సిందే అని అల్లు అరవింద్ అన్నారు.

వర్మ సాఫ్ట్ మర్డరర్.. క్రిమినల్
సినీ పరిశ్రమను బ్రష్టుపట్టించడానికి, పవన్ కల్యాణ్ పరువు, ప్రతిష్టలను దెబ్బతీయడానికి రాంగోపాల్ వర్మ కుట్ర పన్నుతున్నాడు. ఇలాంటి కుట్రలను, పన్నాగాలను పన్ని సాఫ్ట్ మర్డర్ చేసే ఓ క్రిమినల్ రాంగోపాల్ వర్మ. ఓ బాధతో వచ్చిన శ్రీరెడ్డిని వాడుకొన్నావు. నీ బ్యాక్ గ్రౌండ్‌లో నీకు సహకారం అందించింది ఎవరు? పవన్ కల్యాణ్‌ను దెబ్బ తీయడానికి కుట్ర పన్నింది ఎవరు? ఆ కుట్రలో నిన్ను భాగం చేసింది ఎవరు? అనే ప్రశ్నలకు రాంగోపాల్ వర్మ సమాధానం చెప్పాలి అని అరవింద్ మండిపడ్డారు.

నీ బండారం బయటపెట్టడానికి
పవన్ కల్యాణ్‌ను శ్రీరెడ్డితో తిట్టిస్తే.. దానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆమెను కొడితే.. అప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు ఆడదాన్ని కొట్టారని నింద మోపడానికి నీవు ఇలా చీప్‌గా కుట్రలు పన్నావా పిచ్చివాడా.. అని అరవింద్ నిలదీశాడు. పది సంవత్సరాల క్రితం చేసిన కుట్రలకు ఇప్పుడు ఛాన్స్ లేదు. సోషల్ మీడియా చాలా పవర్‌ఫుల్ మీడియాగా మారింది. నీవు చేసేవన్నీ చక్కగా చూస్తున్నారు. ఇలాంటి బయటపెట్టడానికి మీడియా రూపురేఖలు మారాయి.

నీలాంటి నీచులు ప్రతీ ఇండస్ట్రీలో
నీలాంటి నీచులు ప్రతీ ఇండస్ట్రీలో ఉంటారు. చివరిగా ఒక రిక్వెస్టు చేస్తున్నాను. ఇలాంటి డ్రామాలు వేసే పన్నాగాలు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు జరిగాయి. ఇలాంటి వాటికి ప్రస్తుతం తావు లేదు.


Click it and Unblock the Notifications











