పవన్ ఆహ్వానంపై చెప్పలేను: అల్లు అరవింద్
శ్రీజ, శిరీష్ భరద్వాజ్ లను తమ ఇంటికి వచ్చినా, తన అన్న చిరంజీవి ఇంటికి వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని చిరంజీవి బావమరిది, సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో ఫోనులో ఆయన సోమవారంనాడు ఆ విధంగా ప్రతిస్పందించారు. శ్రీజ దంపతులకు ఏ హానీ తలపెట్టబోమని చిరంజీవి కుటుంబ సభ్యులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడంపై న్యాయనిపుణులను సంప్రదిస్తున్నామని, వారి సలహా మేరకు ప్రతిస్పందిస్తామని ఆయన చెప్పారు.
శ్రీజ పెళ్లికి తాము సానుకూలంగా ఉన్నామని, రక్షణ కల్పించాలని శ్రీజ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం విడ్డూరమని ఆయన అన్నారు. శ్రీజ ఎందుకిలా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానంపై తానేమీ ప్రతిస్పందించడం లేదని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











