అనసూయ నీవంటే నాకు చాలా ఇష్టం.. కానీ ఆ విషయం చెప్పలేను.. అల్లు అరవింద్ రొమాంటిక్ కామెంట్

ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి కాంబినేషన్‌లో వస్తున్న చావు కబురు చల్లగా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుక కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ....

బన్నీవాసు వల్లనే ఆహాకు వెళ్లా

బన్నీవాసు వల్లనే ఆహాకు వెళ్లా


గీతా ఆర్ట్స్‌లో బన్నీవాసు సేవలు చాలా కీలకం. నేను ఆహా యాప్‌ను ప్రారంభించడానికి సహాయం చేసింది వాసు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయన గీతా ఆర్ట్స్ చూసుకొంటానని నాకు భరోసా ఇచ్చాడు. దాంతో నేను ఆహాకు సంబంధించిన పనులు చూసుకోవడానికి వీలు కలిగింది అంటూ అల్లు అరవింద్ చెప్పారు.

హీరోయిన్‌ను అలా గోకాడంటూ

హీరోయిన్‌ను అలా గోకాడంటూ

ఇక చావు కబురు చల్లగా సినిమా విషయానికి వస్తే.. ఒకరోజు బన్నీవాసు వచ్చి నేను విచిత్రమైన కథ విన్నాను. ఎవరో చనిపోతే.. ఎవరో ఏడుస్తుంటే.. హీరో వెళ్లి ఓ అమ్మాయిని గోకుతాడు అంటే నాకు చాలా ఆసక్తి కలిగింది. వెంటనే నాకు ఆ కథ చెప్పించు అని అన్నాను. దాంతో కౌశిక్‌ కథ చెప్పుతుంటే అతడు సినిమా తీయగలడు. దర్శకుడు కౌశిక్ చాలా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ అని అన్నారు.

హీరో కార్తికేయ టాలెంట్ గురించి

హీరో కార్తికేయ టాలెంట్ గురించి

హీరో కార్తికేయ టాలెంట్ గురించి చెప్పాలంటే.. ఓ చిన్న సంఘటన గురించి చెప్పాలి. ఓ సీన్ తీయాలంటే దాదాపు రెండు, మూడు గంటలు పడుతుందని నాకు అనిపించింది. చాలా రకాలుగా ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. కాబట్టి పూట మొత్తం తినేస్తారనే ఫీలింగ్‌తో ఉన్నా. కానీ డైరెక్టర్‌ను పిలిచి ఎన్ని గంటలు తీసారని అడిగితే 30 నిమిషాల్లో అయిపోయిందని చెబితే ఆశ్చర్యపోయాను. అది కార్తీకేయ టాలెంట్ అంటూ అరవింద్ ప్రశంసలతో ముంచెత్తారు.

కూతురిలా లావణ్య దెబ్బలాడుతుంది

కూతురిలా లావణ్య దెబ్బలాడుతుంది


గీతా ఆర్ట్స్‌తో లావణ్య త్రిపాఠికి మంచి అనుబంధం ఉంది. నాతో కూతురు మాదిరిగా దెబ్బలాడుతుంటుంది. మేము కొత్తగా సినిమాలు ప్రారంభం చేస్తుంటే.. డైరెక్టుగా నా రూమ్‌లోకి వచ్చి నాకు వేషం ఉందా లేదా? హీరోయిన్‌గా పెట్టుకొంటారా లేదా అని దెబ్బలాడుతుంది అని అల్లు అరవింద్ చెప్పారు.

అనసూయ గురించి అల్లు అరవింద్

అనసూయ గురించి అల్లు అరవింద్

ఇక అనసూయ గురించి మాట్లాడుతూ.. నీవు అంటే నాకు చాలా ఇష్టమని చెప్పలేను. కానీ ఇంతకంటే ఏమీ చెప్పలేను. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించారు. ఆ పాట అందర్నీ ఆకట్టుకొంటుంది. అనసూయ టాలెంట్‌ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదనే విధంగా అల్లు అరవింద్ తన మాటలతో కన్విన్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X