For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవిపై అల్లు అర్జున్ మనసులో మాట అదే! ఫ్యామిలీ విభేదాలపై అల్లు అరవింద్ క్లారిటీ

  |

  టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఓ చరిత్ర ఉంది. తరతరాలుగా తెలుగు ప్రేక్షకలోకాన్ని అలరిస్తూ వస్తోంది ఈ ఫ్యామిలీ. అదేవిధంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీది విడదీయరాని బంధం అనే సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. దివంగత దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య వేసిన పూల బాటలో ఇప్పుడు మెగా, అల్లు కుటుంబం ప్రయాణిస్తోందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయని వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇరు కుటుంబాల ఫ్యాన్స్ నడుమ ఆన్ లైన్ వార్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అల్లు అరవింద్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి రూమర్లపై అల్లు అరవింద్ వివరణ ఇస్తూ..

  అల్లు వారింటి అల్లుడు చిరంజీవి

  అల్లు వారింటి అల్లుడు చిరంజీవి


  అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్లాడి అల్లు వారింటికి అల్లుడిగా ప్రమోట్ అయ్యారు చిరంజీవి. అప్పటికే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు అల్లు వారింటి అల్లుడిగా మారిన తర్వాత మరింత క్రేజ్ సంపాదించారు. సినీ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు టాలీవుడ్ రారాజుగా కీర్తించబడుతున్నారు.

  చిరంజీవి అండదండ.. ఫ్యామిలీ హీరోస్

  చిరంజీవి అండదండ.. ఫ్యామిలీ హీరోస్


  మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ లో మెగా అభిమానాలోకం అనే ఓ పెద్ద ఫ్యామిలీ ఏర్పడింది. తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను కూడగట్టారు చిరంజీవి. అయితే ఒకరకంగా చెప్పాలంటే ఇది తర్వాతి తరానికి బాగా ప్లస్ అయింది. మెగాస్టార్ అండదండతో సినీ రంగ ప్రవేశం చేసిన మెగా కాంపౌండ్ హీరోలు తమ తమ టాలెంట్ చూపిస్తున్నప్పటికీ మెగా లోకం సపోర్ట్ మాత్రం అందుతోంది.

  అల్లు ఫ్యామిలీ నుంచి స్టైలిష్ స్టార్

  అల్లు ఫ్యామిలీ నుంచి స్టైలిష్ స్టార్


  ఇకపోతే అల్లు రామలింగయ్య తర్వాత అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. గంగోత్రి సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి తక్కువకాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నారు. మెగా కాంపౌండ్ హీరో అనే ట్యాగ్ ఆయనకు కొంతమేర ప్లస్ అయినప్పటికీ తనదైన టాలెంట్ తో ఐకాన్ స్టార్‌గా ఎదిగారు అల్లు అర్జున్.

   మెగా Vs అల్లు ఫ్యామిలీ

  మెగా Vs అల్లు ఫ్యామిలీ

  అయితే రాను రాను మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య వైరం పెరిగిందని.. తన టాలెంట్‌కి మెగా ట్యాగ్ యాడ్ చేసుకోవడాన్ని అల్లు అర్జున్ ఇష్టపడటం లేదనే టాక్ ముదిరింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఆర్మీ రంగంలోకి దిగడం, అటు మెగా ఫ్యాన్స్ నువ్వా నేనా అంటూ ఫైట్ చేస్తుండటం హాట్ టాపిక్ అయింది. ఈ పరిస్థితుల నడుమ చిరంజీవిపై బన్నీ ఫీలింగ్స్ అంటూ అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు ట్రెండ్ అవుతున్నాయి.

  చిరంజీవిపై అల్లు అర్జున్ ఫీలింగ్స్

  చిరంజీవిపై అల్లు అర్జున్ ఫీలింగ్స్


  ఓ ఇంటర్వ్యూలో భాగంగా బన్నీకి చిరు మీదున్న ప్రేమ గురించి వివరించారు అల్లు అరవింద్. అల వైకుంఠపురములో ఈవెంట్ లో 'ఈ కట్టె కాలేవరకు చిరంజీవి అభిమానినే' అనే మాట బన్నీ నోట రావడం చూశామని అన్నారు అరవింద్. అదేవిధంగా చిరంజీవి లెవెల్ వేరే అని.. ఆయన స్థాయి గురించి ఇంట్లో కూడా ఎప్పుడూ బన్నీ చెబుతూనే ఉంటాడని అన్నారు అల్లు అరవింద్.

  బన్నీపై చిరు ప్రేమ ఎలాంటిదంటే..

  బన్నీపై చిరు ప్రేమ ఎలాంటిదంటే..


  చిరంజీవికి బన్నీ అంటే చాలా ఇష్టమని, బన్నీని కొడుకుతో సమానంగా చూసుకుంటారని.. బన్నీ ఏం చేసినా కూడా చిరంజీవి ఎంజాయ్ చేస్తారని అన్నారు అల్లు అరవింద్. చిన్నప్పుడు బన్నీ, చరణ్ కలిసి డాన్స్ లు చేస్తుండగా బన్నీని చిరు ఎంకరేజ్ చేసిన ఎన్నో వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయని అల్లు అరవింద్ చెప్పడం విశేషం.

  ఇంతటితో వివాదానికి ఫుల్‌స్టాప్

  ఇంతటితో వివాదానికి ఫుల్‌స్టాప్


  నిజానికి మెగా, అల్లు ఫ్యామిలీల నడుమ నిజంగానే వైరం నడుస్తుందా? లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేకపోయినా సోషల్ మీడియాలో ఇరు కుటుంబాల ఫ్యాన్స్ చేస్తున్న రచ్చతో ఈ అంశం తెరపైకి వచ్చింది. సో.. అల్లు అరవింద్ చెప్పిన మాటలతో ఇకనైనా ఈ రచ్చకు తెర పడుతుందో లేదో చూడాలి మరి!.

  English summary
  Star Producer Allu Aravind reveals Allu Arjun's opinion on Mega star Chiranjeevi. He said, Icon star admires Mega star.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X