షాక్ లో ఉన్నాం: అల్లు అరవింద్
చిన్న కూతురు చెప్పాపెట్టకుండా ప్రేమ వివాహం చేసుకోవడంతో చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులంతా షాక్ కు గురైనట్టు చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ మీడియాకు చెప్పాడు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శ్రీజ ప్రేమ వివాహం గురించి ఏమని స్పందిస్తాడు...తామంతా తీవ్ర షాక్ కు గురయ్యాం...టీవీ చానెళ్లలో చూసే దాకా తమకా విషయం తెలియదు. పిల్లలను స్నేహితుల్లా పెంచాడు...సంవత్సర కాలంగా ఈ పెళ్లి గురించి శ్రీజ ఇంట్లో చర్చిస్తోంది...పెద్దమ్మ ఇంటికి వెళ్లివస్తానని చెప్పి ఇలా చేసింది...అని అల్లు అరవింద్ అన్నారు.


Click it and Unblock the Notifications











