తన్నులు తినొద్దు.... ‘గీత గోవిందం’ వేడుకలో అల్లు అరవింద్ వార్నింగ్

By Bojja Kumar

విజ‌య్‌ దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మందన్న జంట‌గా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం " గీత గోవిందం". బ‌న్నివాసు నిర్మాతగా అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్లో ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్టు 15న మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ వైజాగ్‌లో ఆదివారం గ్రాండ్‌గా జరిగింది. ఓ వైపు 'గీత గోవిదం' సీన్లు లీకై పోలీసులు పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో అల్లు అరవింద్ ఈ విషయమై ప్రస్తావించారు.

Recommended Video

Vijay Deverakonda Speech @Geetha Govindam Pre Release Event
తన్నులు తినొద్దు అంటూ అల్లు అరవింద్ వార్నింగ్

తన్నులు తినొద్దు అంటూ అల్లు అరవింద్ వార్నింగ్

‘గీత గోవిందం'లోని కొన్ని క్లిప్పింగ్స్ లీక్ అయ్యాయి. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పాలనుకున్నాను. పైరసీ చేసే వారికి ఒకటే చెబుతున్నాను. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చేతుల్లో తన్నులు తినొద్దు అని నా విన్నపం. ఇక్కడ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ను కొట్టమని చెప్పడం లేదు కానీ, ఆ ప్రమాదానికి లోనవ్వద్దు అని చెబుతున్నాను. పోలీసులు కూడా మీపై తగిన యాక్షన్ తీసుకుంటారు... అని అల్లు అరవింద్ వార్నింగ్ ఇచ్చారు

మిమ్మల్ని ఇట్టే పట్టేస్తారు

మిమ్మల్ని ఇట్టే పట్టేస్తారు

ఎవరు ఎలాంటి పైరసీ చేసినా ఐపీ అడ్రస్ ద్వారా ఈజీగా కనుక్కునే టెక్నిక్స్ వచ్చేశాయి. ఇలాంటివి జరుగడం ఇండస్ట్రీలో చాలా సిగ్గు పడాల్సిన సమయం ఇది. మా సినిమా కాకుండా రాబోయే ఇంకో మూడు సినిమాలు కూడా లీక్ అయ్యాయని తెలిసి చాలా బాధ పడ్డాను... అని అరవింద్ తెలిపారు.

మాకు నష్టం తక్కువే, కానీ ఆ పెద్ద సినిమాలకు పరిస్థితి ఏంటో...

మాకు నష్టం తక్కువే, కానీ ఆ పెద్ద సినిమాలకు పరిస్థితి ఏంటో...

మా సినిమా ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతోంది. క్లిప్సింగ్స్ లీకైనంత మాత్రాన జరిగే నష్టం ఏమీ లేదు. కానీ రాబోతున్న కొన్ని పెద్ద సినిమాల క్లిప్సింగ్స్ కూడా ఉన్నాయి అది చూస్తే భయమేస్తుంది. అందు వల్ల మీకు వార్నింగ్ చేసేది ఒకటే. ఇలాంటి చేయవద్దు.... అని అరవింద్ అన్నారు.

ఇలాంటివి కొత్తేమీ కాదు...

ఇలాంటివి కొత్తేమీ కాదు...

అల్లు అరవింద్ మాట్లాడుతుంటే.... అభిమానులు అరవడం మొదలు పెట్టారు. దీనిపై అరవింద్ స్పందిస్తూ ఇలాంటివి నాకు కొత్తేమీ కాదు. చిరంజీవిగారు స్టేజి మీద ఉన్నపుడు, చిరంజీవిగారు మాట్లాడక ముందు నేను మాట్లాడాల్సి వచ్చినపుడు మీరు ఇలాంటి గోల చేసినపుడు నాకు సంతోషం అనిపించింది. అటువంటి సంతోషమే ఇపుడు పొందుతున్నాను... అన్నారు.

డైరెక్టర్ విషయం ఉన్నోడు

డైరెక్టర్ విషయం ఉన్నోడు

డైరెక్టర్ పరశురాం మహత్తరమైన సినిమా తీశాడని నమ్ముతున్నాను. ఆయన నా తర్వాతి సినిమా కూడా చేయబోతున్నారు. ఒక డైరెక్టర్‌ను ఒక సంస్థలో మూడు సినిమాలు చేయడానికి ఆయన్ను ఎన్నుకున్నామంటే... మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎటువంటి డైరెక్టరో.... అని అరవింద్ ప్రశంసించారు.

విజయ్ వంద సినిమాలు చేస్తాడు

విజయ్ వంద సినిమాలు చేస్తాడు

విజయ్ దేవరకొండ ఈ రోజు మూడు సినిమాలు, నాలుగు సినిమాలుగా కనబడుతున్నాడేమో? నాకు అతడి లైఫ్ స్పాన్ లో ఒక వంద సినిమాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అతడిని వెర్సటైలిటీ దగ్గర నుండి చూశాను. అతడు మామూలు నటుడు కాదు. అతడు చాలా స్పాన్ ఉన్న నటుడు, త్వరలో అగ్ర శ్రేణిలో నిల్చోబోయే హీరో అని మనస్పూర్తిగా చెబుతున్నాను...అని అరవింద్ అన్నారు.

హీరోయిన్ కోసం మూడు నెలలు వెయిట్ చేశాం

హీరోయిన్ కోసం మూడు నెలలు వెయిట్ చేశాం

హీరోయిన్ రష్మిక గురించి స్పెషల్‌గా చెప్పాలి. ఆమె కోసం సినిమాను మూడు నెలలు ఆపేశాం. ఈ క్యారెక్టర్లో ఆమె మాత్రమే సెట్టవుతుందని, డైరెక్టర్ ఈవిడే కావాలని పట్టుబట్టాడు. ఆమె క్యారెక్టర్ మామూలుగా చేయలేదు... చించేసింది. విజయ్ దేవరకొండతో పోటీపడి నటించింది అని అల్లు అరవింద్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X