twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నా పేరు సూర్య'కి దెబ్బ అని తెలిసికూడా.. బన్నీ నిర్ణయమే, మహా తప్పు అని భావించా .. అల్లు అరవింద్!

    |

    Recommended Video

    Allu Arvind Talks About His Son Allu Arjun

    అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం విడుదలై ప్రదర్శించబడుతోంది. నా పేరు సూర్య చిత్రం దేశభక్తి కథాంశంతో రూపొందినప్పటికీ కొంత డివైడ్ టాక్ వచ్చింది. ఇటీవల అల్లు అరవింద్ మహానటి చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో ఘనంగా పార్టీ ఇచ్చారు. నా పేరు సూర్య చిత్రానికి ఎఫెక్ట్ అని తెలిసిందే ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న అందరిలో మెదిలింది. దానికి అల్లు అరవింద్ ఇచ్చిన సమాధానం ఆసక్తిగా ఉంది. మహా నటి చిత్ర యూనిట్ ని అభినందించాలనే నిర్ణయం బన్నీదే అని అల్లు అరవింద్ అన్నారు.

    బాహుబలి తీసిన మేమురా

    బాహుబలి తీసిన మేమురా

    తెలుగు సినిమా అంటే బాహుబలి తీసిన మేమురా అని ఛాతీ విరుచుకుని చెప్పేలోపే మహానటి చిత్రం వచ్చిందని అల్లు అరవింద్ అన్నారు. ఆ సంతోషాన్ని మహానటి చిత్రం రెట్టింపు చేసిందని అన్నారు.

    నా స్నేహితుడు నడిపించిన చిత్రం

    నా స్నేహితుడు నడిపించిన చిత్రం

    నాగ అశ్విన్ ఇలా తీస్తాడని అసలు ఊహించలేదని అరవింద్ అన్నారు. ఈ చిత్రానికి పనిచేసిన వారంతా యువకులే అని, వారందరిని నా స్నేహితుడు అశ్విని దత్ నడిపించారని అల్లు అరవింద్ అన్నారు. వీరందరిని అభినందించకపోతే మహా తప్పు అని మనసుకు అనిపించింది. అందుకే ఈ పార్టీ ఏర్పాటు చేశా అని అరవింద్ అన్నారు.

    నా పేరు సూర్యకు ఎఫెక్ట్

    నా పేరు సూర్యకు ఎఫెక్ట్

    మహానటి చిత్రం విడుదలై మంచి విజయం సొంతం చేసుకున్న తరువాత బన్నీతో మాట్లాడా. నా పేరు సూర్య చిత్ర కలెక్షన్స్ కి మహానటి చిత్రం ఎఫెక్ట్ ఉంటుంది కదా అని అంటే బన్నీ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచిందని అరవింద్ అన్నారు.

    బన్నీ ఇచ్చిన సమాధానం

    బన్నీ ఇచ్చిన సమాధానం

    పెద్ద హీరోల చిత్రాలు ఏడాదికి 10 వస్తాయి డాడీ. కానీ మహానటి లాంటి చిత్రం పదేళ్లకు ఒక్కటే వస్తుంది అని అల్లు అర్జున్ అన్నాడు. నీ స్నేహితుడు అశ్వినీదత్ ని నీవు అభినందించాలి. టాలీవుడ్ మొత్తం సెలెబ్రేట్ చేసుకునే చిత్రం ఇది అని బన్నీ అన్నట్లు అల్లు అరవింద్ అన్నారు.

    హరీష్ శంకర్ మాట్లాడుతూ

    హరీష్ శంకర్ మాట్లాడుతూ

    అల్లు అర్జునే తనకు ఫోన్ చేసి మరీ ఎన్ని పనులు ఉన్నా మహానటి చిత్రాన్ని చూడమని చెప్పారని, తన సినిమా ఆడుతున్నప్పటికీ ఈ ఈవెంట్ నిర్వహించి బన్నీ పెద్ద మనసున్న హీరో అనిపించుకున్నాడని హరీష్ శంకర్ అన్నారు.

    ఆ సన్నివేశం నుంచే ఏడ్చేశా

    ఆ సన్నివేశం నుంచే ఏడ్చేశా

    సావిత్రి సాధించిన అవార్డుని సమంత తాకే సన్నివేశం ఉంటుంది. అప్పటినుంచే తన కంట కన్నీరు కారడం ప్రారంభమైందని హరీష్ శంకర్ అన్నారు. ఈ సినిమా చూసిన తరువాత నాగ అశ్విన్ బ్రిలియంట్ గా డైరెక్ట్ చేసాడని అనిపించినట్లు హరిశంకర్ తెలిపారు.

    English summary
    Allu Aravind Speech At Mahanati Success Party. This is Allu Arjun idea says Aravind
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X