twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నా పేరు సూర్య’ సినిమాపై కుట్రలు జరుగుతున్నాయి: అల్లు అరవింద్ సంచలనం

    By Bojja Kumar
    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. మే 4న సినిమా విడుదల చేస్తున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమాపై కుట్ర జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు.

    Recommended Video

    Allu Arjun Talks About His Movie Naa Peru Surya
    అందుకే సక్సెస్ మీట్ అని పొగరుగా చెబుతున్నాను

    అందుకే సక్సెస్ మీట్ అని పొగరుగా చెబుతున్నాను

    ఒక హానెస్టీ ఉన్న సినిమా చేయాలని బన్నీ చాలా కాలంగా అనుకుంటున్నాడు. మంచి కథ దొరకిందని ఊగిపోతూ మాకు వచ్చి చెప్పాడు. అయితే ఈ దర్శకుడు ఇలా తీస్తాడని మాత్రం నేను అనుకోలేదు. బన్నీకి అతడిపై ఎంత నమ్మకం అంటే.... అతడు ఇంత వరకు కనీసం షార్ట్ ఫిల్మ్ తీయకున్నా డైరెక్టుగా షూటింగుకు వెళ్లిపోయాడు. కథ విన్నప్పటి నుండి అతడిపై ఉన్న కాన్ఫిడెన్స్‌కి రియల్లీ అప్రిషియేట్. బన్నీకి ఎందుకు అంత నమ్మకం అనిపించింది అనేది ఆ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. సినిమా చూశాను కాబట్టి చెబుతున్నాను.... ఇపుడు ఎక్కువగా మాట్లాడను, సక్సెస్ మీట్లో మాట్లాడదామని పొగరుగా చెబుతున్నాను.... అని అల్లు అరవింద్ అన్నారు.

    దాసరి పుట్టినరోజన సినిమా వస్తోంది

    దాసరి పుట్టినరోజన సినిమా వస్తోంది

    ఇక్కడ మూడు ముఖ్యమైన చిన్న విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దాసరి నారాయణరావు గారి పుట్టినరోజున ఈ సినిమా విడుదల కావడం మాకు చాలా గర్వంగా ఉంది. ఆ రోజున డైరెక్టర్స్ డే అని డిక్లేర్ చేయబోతున్నారు. ఆ రోజున మా సినిమా రావడం ఆనందంగా ఉంది... అని అల్లు అరవింద్ అన్నారు.

    ఈ సినిమా మీద కుట్రలు జరుగుతున్నాయి

    ఈ సినిమా మీద కుట్రలు జరుగుతున్నాయి

    ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ మధ్య కుచించుకుపోయేలాగా... మనసుకు బాధ కలిగించే విధంగా, ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఎంతో కొంత మదన పడేలాగా కొన్ని విషయాలు జరిగాయి. ఆ విషయాల మీద మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత మంది ఈ సినిమాను తప్పుతోవ పట్టించడానికో, మిక్డ్స్ టాక్ తీసుకురావడానికో, విమర్శించడానికో ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాన్ని దాటగలిగినవారు మీరందరూ, మీ వల్లే అది సాధ్యం... అని మెగా అభిమానులను ఉద్దేశించి అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.

    బన్నీ నువ్వు ఈ గొడవతో కనెక్ట్ కావొద్దు

    బన్నీ నువ్వు ఈ గొడవతో కనెక్ట్ కావొద్దు

    ఈ స్క్రీన్ వెనకాలే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అందుకే ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ స్టాండ్ తీసుకోవడానికి నమ్మకం మీరందరూ... సినిమా మావుంటే మీరే హర్షిస్తారు, మీరే ఆనందపడతారు. బన్నీ... నీకు ఈ విషయం తర్వాత చెబుతాను, కొన్ని విషయాలు జరుగుతున్నాయి నువ్వు దీనికి కనెక్ట్ కావొద్దు.... అని అల్లు అరవింద్ సూచించారు.

    బన్నీ వ్యాస్ ఆయన్నే తీసుకురావాలని పట్టుబట్టాడు

    బన్నీ వ్యాస్ ఆయన్నే తీసుకురావాలని పట్టుబట్టాడు

    ఈ సినిమాలో హీరోయిన్ ఎంతో అందంగా కనిపించింది. ఈ సినిమా సాంగ్స్ ను నేనే ఎడిటింగ్ రూముకు వెళ్లి రిపీట్ వేసి చూసుకున్నాను. ఈ సినిమాకు సంబంధించి అర్జున్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఈ క్యారెక్టర్ చేస్తారా? అంటే చేయర్రా అని అన్నాను. కానీ బన్నీ వ్యాస్ ఆయన్నే తీసుకురావాలని పట్టుబట్టాడు. ఎందుకు ఇంత పట్టుబడుతున్నాడు అనేది సినిమా రషెస్ చూసిన తర్వాత అర్థమైంది...అని అరవింద్ తెలిపారు.

    English summary
    Allu Aravind Speech at Naa Peru Surya Na Illu India Pre Release Event. Starring #AlluArjun, #AnuEmmanuel, Music composed by Vishal–Shekhar, Directed by Vakkantham Vamsi and Produced by Sirisha Sridhar Lagadapati, Bunny Vas under the banner of Ramalakshmi Cine Creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X