»   » జరుగుతుందనుకోలేదు, బాలయ్యకే ఆ దమ్ము ఉంది: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్

జరుగుతుందనుకోలేదు, బాలయ్యకే ఆ దమ్ము ఉంది: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ ప్రారంభోత్సవంలో మెగా నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీ రామారావు గురించి. బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నందమూరి అభిమానులకు అభివందనాలు చెబుతూ తన ప్రసంగం మొదలు పెట్టారు అల్లు అరవింద్. తెలుగు వాడికి గుర్తింపు లేని ఒక సందర్భంలో మనమంతా నార్త్ ఇండియా వారి దృష్టిలో మదరాసీస్. మేము మదరాసీస్ కాదురా, తెలుగువాళ్లం అని మొదట చాటి చెప్పింది ఎన్టీఆర్ గారు. తెలుగువాడికి ఒక గుర్తింపు తీసుకొచ్చి, తెలుగువాడి ఖ్యాతిని పతాక స్థాయికి తీసుకెళ్లిన నందమూరి వారికి, కుటుంబ సభ్యులకు అభినందనలు... అన్నారు.

Allu Aravind Speech at NTR Biopic Movie Launch Event

మహత్తరమైన చరిత్ర సృష్టించిన రామారావుగారి చరిత్రను తెరపైకి తీసుకురావడమే ఓ సాహసం, బాలకృష్ణ దానికి అర్హుడు అని ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటి సాహసం చేయడానికి ఒక దమ్మున్న మనిషి కూడా బాలకృష్ణగారే... అని అల్లు అరవింద్ అన్నారు.

ఈ స్క్రిప్టును మొదటిసారిగా రెండున్నర సంవత్సరాల క్రితం నా స్నేహితుడైన కో ప్రొడ్యూసర్‌గా విష్ణు నాకు చెప్పారు. బ్రహ్మాండంగా ఉంది, ఇందులో యాక్ట్ చేయాలంటే బాలకృష్ణ తప్ప ఎవరూ సరిపోరు అని అపుడు మాట్లాడుకున్నాం కానీ ఇది జరిగుతుంది అనుకోలేదు. బాలయ్యకు, తేజకు, నిర్మాతలకు, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిజేస్తున్నాను... అని అల్లు అరవింద్ అన్నారు.

English summary
Allu Aravind Speech at NTR Biopic Movie Launch Event. #NTRBiopic, is launching on 29 March 2018, at Ramakrishna Studios, Hyderabad, by the Honorable Vice President of India, Sri M. Venkaiah Naidu garu, as the Chief Guest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X