పాండీ బజార్లో దాసరి నాకు క్లాస్ పీకారు.. అల్లు అరవింద్
Recommended Video

దర్శకరత్న దాసరి నారాయణ రావు పైన ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి రామారావు రూపొందించిన 'తెరవెనుక దాసరి' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నాడు సిని ప్రముఖులు, దాసరి శిష్యులు, దాసరి కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, టి సుబ్బిరామిరెడ్డి, మురళి మోహన్, ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖులు పలువురు రాసిన వ్యాసాల సంకలనంగా ఈ పుస్తకం రూపొందింది.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. దాసరితో నాకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. చెన్నైలోని పాండిబజార్‌లో ఓ సారి దాసరికి కనిపించాను. అప్పుడు నాతో నీవు నిర్మాతగా మారు. మీ నాన్న చెబితే సినిమా తీయనని చెప్పావటగా అని అన్నారు. ఆ తర్వాత దాసరి ఇచ్చిన సలహాలు, సూచనలతో తొలిసారి నిర్మాతగా మారి ఆయనతో సినిమా తీశాను. మా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఆయనే తొలి దర్శకుడు అని అల్లు అరవింద్ అన్నారు.


Click it and Unblock the Notifications











