చిరంజీవిని అలా అడగగలవా.. అల్లు అరవింద్‌కు మమ్ముట్టి ప్రశ్న.. సారీ అంటూ ఫోన్ కట్
స్వాతి కిరణం, దళపతి సినిమాలు చూసిన వారెవరికైనా.. మమ్ముట్టి అలా గుర్తుండిపోతారు. అసాధారణ నటనతో, గంభీరంతో నిండిన గొంతుతో పాత్రలకు వన్నె తెచ్చే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.. రీసెంట్‌గా యాత్ర సినిమాతో పలకరించారు. ఏ భాషలో సినిమా చేసినా.. తన పాత్రకు తన గొంతే వినిపించాలని తాపత్రయ పడే నటుడు మమ్ముట్టి. అందుకే భాషలపై పట్టు సాధించి.. ఆయనే సొంతంగా డబ్బింగ్ చెబుతూ ఉంటారు. చివరగా వచ్చిన యాత్ర సినిమాలోనూ ఆయన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు.

భారీ బడ్జెట్‌తో మరోసారి..
బాహుబలి ఇచ్చిన స్పూర్తితో అన్ని ఇండస్ట్రీలో చారిత్రక నేపథ్యమున్న చిత్రాలు, భారీ బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి. తాజాగా మాలీవుడ్‌లోనూ ఓ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతోంది. చరిత్ర విస్మరించిన ఓ యోధుడి కథతో మామంగం అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

గీతా ఆర్ట్స్ ద్వారా..
భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసిన చిత్రబృందం తెలుగులో గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీకి సంబంధంచి కొన్ని విషయాలను తెలిపేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అనేక విషయాలను వెల్లడించారు.

ఆశ్చర్యానికి గురి చేసిన నటుడు..
స్వాతి కిరణం సినిమాకు ఎవరో మలయాళ నటుడిని తీసుకుంటారెందుకు, మన వాళ్లకు కనెక్ట్ అవుతాడా? అని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. తీరా సినిమా చూశాక లేచి నిల్చోకలేకపోయాను.. గుండె బరువెక్కింది.. అంతలా ఆశ్చర్యపోయేలా నటించిన అతని గురించి అలా అనుకున్నానా? అంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

పవన్ సినిమాలో విలన్ క్యారెక్టర్..
ఆ సినిమా తరువాత ఆయనతో కాస్త పరిచయం ఏర్పడిందని చెప్పిన అల్లు అరవింద్ మరొక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. పదేళ్ల క్రితం మమ్ముట్టికి ఫోన్ చేశానని, పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఉందని చెప్పానని అల్లు అరవింద్ తెలిపాడు.
Recommended Video

అలా చిరంజీవిని అడగగలవా?
అయితే వెంటనే అందుకున్న మమ్ముట్టి.. ఇదే మాట చిరంజీవిని అడగగలవా? అని ఎదురు ప్రశ్నించాడ మమ్ముట్టి.. తాను చిరంజీవిని అలా అడగలేనని అల్లు వారు సమాధానమిచ్చారట. అయితే తనను ఎందుకు అడుగుతున్నారంటూ ప్రశ్నించడంతో.. సారి చెప్పి అల్లు అరవింద్ ఫోన్ కట్ చేశారట.


Click it and Unblock the Notifications











