twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కక్ష సాధింపుతోనే గీతా ఆర్ట్స్ పై దాడి: అల్లు అరవింద్‌

    By Srikanya
    |

    గీతా ఆర్ట్స్ కార్యాలయంపై తెలంగాణవాదుల దాడిని సినీ నిర్మాత అల్లు అరవింద్‌ ఖండించారు. వ్యక్తిగత కక్ష కారణంగానే తమ కార్యాలయంపై దాడి జరిగిందని గీతా ఆర్ట్స్‌ సంస్థ అధినేత అల్లు అరవింద్‌ అన్నారు. ఈ ఘటనను తాను రాజకీయ కోణంలో చూడడం లేదని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇదంతా కావాలనే చేశాడని ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.తమ గీతా ఆర్ట్స్ ఆఫీస్ పై ఆదివారం తెలంగాణా వాదులు చేసిన దాడి సరికాదని, కావాలంటే నా ఆస్తులు రాసిస్తానని ఆయన అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లో గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ నేతలు ఆదివారం ధర్నా చేపట్టారు.

    తెలంగాణలో ఉంటూ సమైక్యాంధ్రకు మద్దతు పలికిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే లక్ష్యంగా తెలంగాణవాదులు ఈ కార్యక్రమం చేపట్టారు. సినిమావాళ్లు సమైక్యాంధ్ర నినాదం చేయడం ఎంతవరకు సమంజసమని వాళ్ళు ప్రశ్నించారు. హైదరాబాద్‌ మీ మేనమామ సొత్తా? అంటూ మోహన్‌బాబు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఇది వారి మేనమామలదేనని, అయితే తాము వారి అల్లుళ్లమని అన్నారు. మోహన్‌బాబు తమకు బావ అవుతారని ఎద్దేవా చేశారు.

    అలాగే తెలంగాణా వాదులు గీతా ఆర్ట్స్ కార్యాలయం పేరును తెలంగాణ యువజన ఐక్యవేదిక మార్చారు. జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భవనంపై బ్యానర్లు కట్టారు. అంతేకాకుండా కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జేఏసీ ప్రకటించింది. దీనిని ఖండిస్తూ అల్లు అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. కాగా అల్లు అరవిందుకు సంఘీభావం తెలిపేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు విజయరామారావు, తీగల కృష్ణారెడ్డిలు గీతా ఆర్ట్స్ ఆఫీసుకు చేరుకున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X