యస్..అల్లు అరవింద్ బాస్

By Staff

Allu Aravind
గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్ హిందీలో రూపొందించిన గజనీ రీమేక్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు రెండువందల కోట్ల పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ చిత్రం సక్సెస్ మీట్ ఈ మధ్యనే ముంబయిలో జరిగింది. ఈ సందర్బంగా ప్రింటు చేసిన ఇన్విటేషన్ లో అమీర్ ఖాన్ ...అల్లుఅరవింద్ ని నిర్మాతగా కాక బాస్ గా పేర్కొని ప్రింటు చేయించాడు. అదేంటని అడిగిన వారికి యస్.హీ ఈజ్ ద బాస్ అని సమాధానమిచ్చాడు. ఇక ఇంతటి హిట్ వెనక అల్లుఅరవింద్ ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

మరో ప్రక్క అమీర్‌ సొంత చిత్రం 'తార జమీన్‌పర్‌' చిత్ర షూటింగ్‌ వల్ల , 'గజని' చిత్రం షూటింగ్‌లో ఆయన గాయపడటం వల్ల కొన్ని రోజులు షూటింగ్‌ జరగలేదు. అలాగే రిలీజ్‌కు ముందు కోర్టు కేసులు ఎదుర్కొనవలసి రావడం... ఇత్యాది ఇబ్బందులు ఎదురైనప్పటికీ అధైర్యపడకుండా చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేశారని అరవింద్‌ని అంతా మెచ్చుకున్నారు. అలాగే ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించిన అరవింద్‌ తనయుడు శిరీష్‌ సినిమా ప్రమోషన్‌ పరంగా, మార్కెటింగ్‌ పరంగా కొత్త పద్దతులు అనుసరించి అందరినీ ఆకట్టుకోవటం ఇవాళ చర్చనీయాంశంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X