అందుకే నా బ్యానర్‌లో చేసుకో అని చెప్పా: అల్లు అరవింద్

By Srikanya

"సుకుమార్‌ తాను రాసుకొనే ప్రతి కథ నాతో చర్చిస్తాడు. ఈ కథ చెప్పి చిన్న సినిమాగా తీద్దాం అనుకొంటున్నాం అన్నాడు. ఇంత మంచి కథ తప్పకుండా భారీగానే తీయాలి. అందుకే నా బ్యానర్‌లో చేసుకో అని చెప్పా" అన్నారు అల్లు అరవింద్‌. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన '100% లవ్‌' ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకను ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఇలా స్పందించారు. ఇక దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ...నాగచైతన్య తప్పకుండా మంచి నటుడిగా ఎదుగుతాడు. అతనిలో ఆ ప్రతిభ ఉంది. ఇక తమన్నా చిన్న చిన్న హావభావాలు కూడా అద్భుతంగా పలికించిందన్నారు. చివరగా నాగచైతన్య మాట్లాడుతూ..సినిమా సినిమాకీ కొత్తదనం ఉండాలనేది నా ఆలోచన. ఆ కోవలో నాకు దొరికిన ఓ అదృష్టం '100% లవ్‌'. సుకుమార్‌ ఈ సినిమాని తెరకెక్కించిన విధానం చాలా బాగుందన్నారు నాగచైతన్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X