Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఓటీటీలోనూ భారీ బడ్జెట్.. ఆ స్టార్‌తో రూ. 170 కోట్ల బడ్జెట్.. అల్లు అరవింద్ సంచలన ప్రకటన
టాలీవుడ్‌లోని అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రొడ్యూసర్స్‌లో అల్లు అరవింద్ ఒకరు. ఆయన చేతిలో ఓ ప్రాజెక్డ్ పడినా, ఓ స్క్రిప్ట్‌కు ఓకే చెప్పినా అది మినిమమ్ గ్యారెంటీ అన్న టాక్ ఉంది. అందుకే టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ మూడు దశాబ్దాలకు పైగా సక్సెస్ అవుతున్నాడు. అయితే రాబోయే తరాన్ని, కాలాన్ని ముందే ఆలోచించి ఆహా వంటి యాప్‌ను కూడా లాంచ్ చేసి ముందుచూపున్న నిర్మాతగా మరోసారి నిరూపించుకున్నాడు.
నిజంగా ‘ఆహా'నే..
కరోనా, లాక్ డౌన్ వంటి పరిస్థితులు ఎదురవుతాయని ముందే ఊహించారో ఏమో గానీ సొంత ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై కన్నేశాడు అల్లు అరవింద్. రాబోయే కాలం అంతా ఓటీటీ అని గ్రహించాడో ఏమోగానీ.. ఆహాను ప్రారంభించేశాడు. మెల్లిమెల్లిగా చిత్రాలను సేకరించారు. అయితే ఈ లాక్ డౌన్ కాలంలో మాత్రం ఆహా బాగానే క్లిక్కయింది.
సినిమాలు, వెబ్ సిరీస్‌లు..
దాదాపు నాలుగు నెలల లాక్ డౌన్ కాలంలో ఓటీటీ సంస్థలే దిక్కయ్యాయి. అందులో భాగంగా తెలుగులో అంతో ఇంతో ఫేమస్ అయిన ఆహాకు మరింత ఆదరణ లభించింది. ఆహాలో వచ్చిన చిత్రాలు, వెబ్ సీరీస్లు ఫుల్ సక్సెస్ అయ్యాయి. కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమతి రామకృష్ణ వంటి చిత్రాలు బాగా వైరల్ అయ్యాయి.
తాజా ప్రకటన..
అయితే ప్రస్తుతం సినిమా థియేటర్లు ప్రారంభం కాకపోయినా ఓటీటీ సత్తా చాటుతోంది. వీటిపై అల్లు అరవింద్ స్పందిస్తూ.. ఓటీటీ ఎంతగా పాపులర్ అయినా సరే ప్రేక్షకులు థియేటర్లలో చూడటానికి ఇష్టపడతారు. వాటికి ఉండే ఆదరణ వాటికే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఓటీటీకి భవిష్యతు మాత్రం ఉందని తెలిపాడు.
భారీ స్కెచ్..
ఆహా యాప్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నామని అల్లు అరవింద్ తెలిపాడు. బాలీవుడ్ సూపర్ స్టార్.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతోన్నామని పేర్కొన్నాడు. దాదాపు 170 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతోన్నామని ప్రకటించాడు. అయితే ఇప్పుడే వివరాలు ప్రకటించలేమని పేర్కొన్నాడు. మరి ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో చూడాలి.